Asianet News TeluguAsianet News Telugu

ఇండియాకి వచ్చినప్పుడు ఆ రోజు వర్షంలో.. ఇంటర్వ్యూలో ఓ ఘటనను గుర్తుచేసుకున్న ..: సన్నీలియోన్

భారత్‌కు దిగుమతి చేసుకున్న మూడు లగ్జరీ కార్లు వర్షం కారణంగా కొట్టుకుపోయాయన్న చీకటి అనుభవాన్ని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ వెల్లడించారు. 
 

bollywood Actress Sunny Leone lost three cars worth crores!-sak
Author
First Published Aug 18, 2023, 1:13 PM IST

బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ వద్ద చాలా  కాస్ట్లీ  అండ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమెకి కార్ క్రేజ్ కూడా చాల ఎక్కువ. లగ్జరీ కారు కొనుగోలు చేసినప్పుడల్లా సోషల్ మీడియాలో వాటి  గురించి తెలియజేస్తారు.  సన్నీ వద్ద ఉన్న లగ్జరీ కార్లన్నీ కోట్లలో ఉంటాయి. అయినప్పటికీ, ఈ బాలీవుడ్ బ్యూటీకి దేశ విదేశాలలో ఆస్తులు  ఉన్నాయి. అమెరికాలో ఉంటున్న సన్నీలియోన్.. తొలిసారి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ వర్షాకాలాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటనను నెమరువేసుకుంది. ఆమెకి ఇటీవల తన ఇష్టం ఇంకా  భారతదేశ వర్షాకాల జ్ఞాపకాల గురించి చెప్పింది. ఈ సందర్భంగా నటి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
 
ముంబై వర్షాలతో తన మొదటి అనుభవాన్ని సన్నీ లియోన్ గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ భారీ వర్షంలో మూడు ఖరీదైన కార్లు పోయాయన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడుతూ.. 'ముంబై వర్షాల గురించి నాకు తెలియదు. ఆకాశం నుంచి ఇంత వర్షం కురుస్తుందన్న ఆలోచన కూడా లేదు.' రుతుపవనాలపై తన ప్రేమను పంచుకుంటూ నటి ఇలా చెప్పింది, 'నేను ముంబైలో నివసించాను, నిజంగా సముద్రానికి దగ్గరగా ఉంటున్న.  నేను ఓ పని కోసం భారతదేశానికి వచ్చినప్పుడు, ఇక్కడ కురుస్తున్న వర్షాన్ని చూసి షాక్ అయ్యాను. ఇక్కడి వాతావరణం నాకు నచ్చింది. అలాగే మాన్‌సూన్ బహుశా వాటిలో ఒకటి.

చిన్నపాటి వర్షం కురిస్తే ఫర్వాలేదు కానీ ఒక్కసారి నా మూడు లగ్జరీ కార్లు కొట్టుకుపోతే ఎవరికైనా కూడా బాధ కలుగుతుంది’ అని నటి చెప్పింది. మూడు కార్లు పోయినందుకు తాను ఎలా బాధపడ్డానో చెప్పుకొచ్చారు. 'వర్షానికి నేను మూడు మంచి కార్లను పోగొట్టుకున్నాను, ఒకే రోజులో రెండు. ఇది భయంగా అనిపించింది. ఎందుకంటే నేను ఆ కార్లను ఇండియాకు దిగుమతి చేసుకున్నాను. ఈ  సందర్భంగా  వాటికీ పన్ను కూడా చెల్లించినట్లు తెలిపారు.

నటి తాను పోగొట్టుకున్న కార్ల గురించి వివరించింది, అందులో ఒకటి ఎనిమిది సీట్ల మెర్సిడెస్ ట్రక్. ఇప్పుడు నేను నా భారతీయ కార్లను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కార్లు వర్షాకాలం ప్రకారం తయారవుతాయని నాకు అర్థమైంది. అప్పుడు నా అప్షన్ తప్పు అని నాకు అనిపించింది. తన వృత్తిపరమైన కట్టుబాట్లకు రుతుపవనాలు ఎప్పుడూ అడ్డుపడలేదని సన్నీ చెప్పారు.  

సన్నీ సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ, త్వరలో రాబోయే తమిళ చిత్రం కొటేషన్ గ్యాంగ్‌లో సన్నీ కనిపించనుంది. వివేక్ కె. కుమార్ ఈ సినిమాకి  దర్శకత్వం వహించగా జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్ ఇందులో సన్నీతో పాటు జయప్రకాష్, విష్ణు వారియర్ ఇంకా ఇతరులతో సహా   తారాగణం ఉంది. ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios