Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు రియలిస్టిక్ పాలసీ కావాలి:రతన్ టాటా హితవు

సోషల్ మీడియాలోని తన ఖాతాలో రతన్ టాటా పోస్ట్ చేస్తూ ‘కార్లలో ప్రొపల్షన్ సిస్టం భవితవ్యంపై ఆటోమొబైల్ పరిశ్రమ, ప్రపంచదేశాల్లోని ప్రభుత్వాలు ఒక వైఖరిని కలిగి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.

Auto Industry Needs To Plan What Will Drive The Cars Of The Future: Ratan Tata
Author
New Delhi, First Published Feb 9, 2020, 1:28 PM IST

ముంబై: ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వాడకంపై చర్చ విపరీతంగా పెరిగింది. విద్యుత్ వాహనాల్లో ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) తొలగించాలా? వద్దా? అన్న అంశంపై చర్చ జరుగుతున్నది. 

అయితే, విద్యుత్ వాహనాల వాడకం, ఉత్పత్తిపై ప్రభుత్వాలు, ఆటోమొబైల్ సంస్థలు వాస్తవిక ద్రుక్పథంతో కూడిన విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని టాటా మోటార్స్ చైర్మన్ ఎమిరస్ చైర్మన్ రతన్ టాటా సూచించారు. 

విద్యుత్ వాహనాలను నడపడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించకుండా పూర్తిస్థాయిలో విద్యుద్ధీకరించిన వాహనాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యాన్ని చేరుకోలేమని రతన్ టాటా స్పష్టం చేశారు. 

సోషల్ మీడియాలోని తన ఖాతాలో రతన్ టాటా పోస్ట్ చేస్తూ ‘కార్లలో ప్రొపల్షన్ సిస్టం భవితవ్యంపై ఆటోమొబైల్ పరిశ్రమ, ప్రపంచదేశాల్లోని ప్రభుత్వాలు ఒక వైఖరిని కలిగి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. విద్యుత్ వాహనాల్లోకి ప్రత్యేకించి ఓమ్నీ ప్రెజెంట్ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎకాఎకీన విద్యుత్ వాహనాల్లోకి జంప్ చేయడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.

‘హైబ్రీడ్ వాహనాల ఇంట్రడక్షన్‌లో ఐసీ ఇంజిన్లలో ఇంప్రూవ్‌మెంట్ విభిన్న ప్రొపల్షన్ సిస్టమ్‍లో వాస్తవిక ద్రుక్పథం కలిగి ఉండాలి’ అని రతన్ టాటా తెలిపారు. అంతర్జాతీయంగా పలు దేశాలు ‘ఐసీఈ ఇంజిన్ల మార్పునకు, వచ్చే కొన్ని దశాబ్దాల్లో విద్యుత్ వాహనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెబుతున్నాయి. 

2032 నాటికి పెట్రోల్, డీజిల్ వినియోగ కార్లను తప్పించేసి విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెస్తామని స్కాట్లాండ్ చెబుతోంది. ఇక నార్వే 2025 నాటికి, ఫ్రాన్స్ 2040 నాటికి ఐసీఈ ఇంజిన్లను తొలిగించి వేసి విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తోంది. 

మిగతా దేశాల్లో మాదిరిగానే భారత ప్రభుత్వం కూడా 2030 నాటికి వాహనాల విద్యుద్ధీకరణ పూర్తి చేయగలమని ఆకాంక్షిస్తోంది. కానీ ఇందుకు సరైన ప్రణాళిక అనేది భారత ప్రభుత్వం వద్ద లేకపోవడమే లోటు. 

Also read:కళ తప్పిన ఆటో ఎక్స్‌పో: బీఎండబ్ల్యూ, జాగ్వార్ వంటి దిగ్గజాలు దూరం

2020 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి బీఎస్-4 నుంచి బీఎస్-6 ప్రమాణాల వైపు అడుగులేసేందుకు భారత్ సిద్ధమవుతంది. గతేడాది కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ విద్యుద్ధీకరించిన వాహనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికల్లేవని అంగీకరించారు. 

టాటా మోటార్స్ భారీ స్థాయిలో భారత విపణిలో విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే రెండు విద్యుద్ధీకరించిన కార్లను ఆవిష్కరించింది. టైగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ అనే పేరుతో విడుదల చేసిన కార్లు కూడా వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.

టాటా పవర్, టాటా ఆటో కాంప్స్, టాటా కెమికల్స్ సంస్థలతో కలిసి టాటా మోటార్స్ భారతదేశానికి అవసరమైన పూర్తిస్థాయి ఎకోసిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ కంపెనీ 500కి పైగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios