Asianet News TeluguAsianet News Telugu

తిరుమల సమాచారం.. శ్రీవారి హుండీ ఆదాయంపై...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం సెలవులు కావడంతో భక్తులు తాకిడి అదికంగానే ఉంది. దీంతో క్యూ కాంప్లెక్స్ లోని గదులన్నీ భక్తులతో నిండిపోయాయి.  సర్వదర్శనానికి దాదాపు 24గంటలు సమయం పడుతుండగా స్లాటెడ్‌ దివ్య, సర్వదర్శనాలకు దాదాపు 5గంటలు సమయం పడుతోంది.

the-economic-downturn-affect-decrease-tirumala-lord-venkateswara-hundi-revenue
Author
Tirupati, First Published Oct 12, 2019, 11:20 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం సెలవులు కావడంతో భక్తులు తాకిడి అదికంగానే ఉంది. దీంతో క్యూ కాంప్లెక్స్ లోని గదులన్నీ భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి దాదాపు 24గంటలు సమయం పడుతుండగా స్లాటెడ్‌ దివ్య, సర్వదర్శనాలకు దాదాపు 5గంటలు సమయం పడుతోంది. శుక్రవారం రోజున  42,270 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.

శుక్రవారం స్యామివారి హుండీ అదాయం రూ.2.86 కోట్లు సమకూరినట్లుగా టీటీడీ అధికారులు వెల్లండిచారు. శ్రీవారికి హుండీపై ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్  పడినట్లు  కనిపిస్తోంది. భక్తులు సమర్పించే హుండీ ఆదాయం గత కొన్ని మాసాలుగా తగ్గిపోవడం టీటీడీ లెక్కల ద్వారా కనబడుతున్నది. 20 సంవత్సరాల క్రితం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ 30 నుంచి 40 వేల మంది వరకు ఉన్నప్పుడే ఆదాయం ఇంతలా ఉండేది. క్రమంగా భక్తుల రద్థీ పెరుగుతున్న ఆదాయం పెరగడం లేదు. ఇది ఆర్ధిక మాంధ్యం ప్రభావమేనని పరిశీలకులు  
అంటున్నారు.

తాజాగా టీటీడీ భక్తుల సౌకర్యార్ధం కీలక  నిర్ణయం తీసుకుంది. అక్టోబ‌రు 15, 29న  వృద్ధులు, దివ్యాంగులక కోసం  ప్రత్యేక ఉచిత దర్శన ఏర్పాట్లను  చేసింది. అలాగే అక్టోబ‌రు 16, 30 తేదీల్లో చంటిపిల్లల వారి తల్లిదండ్రుల కోసం కూడా  ప్రత్యేకంగా దర్శించేకునే అవకాశం కల్పించారు. అదే విధంగా ఎన్నారైల కోసం కూడా స్రత్యేక దర్శన   ఏర్పాట్లను చేసింది టీటీడీ. సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనం కోసం వారికి పత్యేక  అనుమతించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios