Asianet News TeluguAsianet News Telugu

పొట్టి దుస్తులకు నో ఎంట్రీ.. కుర్తీలు వేసుకున్నా కూడా..(వీడియో)

కాలేజీకి ఆలస్యంగా వస్తే... లోపలికి అనుమతించకపోవడం లాంటి సంఘటనలు చూసే ఉంటారు. కానీ... అమ్మాయిలు దుస్తులపై ఆంక్షలు విధించి.. వారికి కాలేజీలోకి రాకుండా అడ్డుకోవడం ఎక్కడైనా చూశారా..? ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

First Published Sep 16, 2019, 11:05 AM IST | Last Updated Sep 16, 2019, 11:05 AM IST

కాలేజీకి ఆలస్యంగా వస్తే... లోపలికి అనుమతించకపోవడం లాంటి సంఘటనలు చూసే ఉంటారు. కానీ... అమ్మాయిలు దుస్తులపై ఆంక్షలు విధించి.. వారికి కాలేజీలోకి రాకుండా అడ్డుకోవడం ఎక్కడైనా చూశారా..? ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అమ్మాయిల దుస్తులపై ఆంక్షలు విధించారు. మోకాళ్ల పైకి దుస్తులు వేసుకోని అమ్మాయిలను కాలేజీలోకి అనుమతించడం లేదు. కాలేజీ గేటు వద్ద ఓ ఉపాధ్యాయిని నిలబడి.. వాళ్ల దుస్తులు పరిశీలించి.. సరిగా ఉన్నాయి అనుకున్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి గేటు నుంచే బయటకు పంపిస్తున్నారు.

సరే... అమ్మాయిలు నిజంగానే దుస్తులు సరిగా వేసుకోలేదా అంటే... కుర్తీలు వేసుకున్న అమ్మాయిలను కూడా వెనక్కి పంపించడం గమనార్హం. కుర్తీలు కూడా మోకాళ్ల కిందకు ఉండాల్సిందినేని నిబంధన విధించడం గమనార్హం. కాలేజీ యాజమాన్యం మమ్మల్ని  ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ కాలేజీ విద్యార్థినులు.. వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా... ఆ వీడియో వైరల్ గా మారింది.