విషం సర్ఫ కాటుకు రెండు మూగ జీవాలు బలైపోయాయి. నిద్రిస్తున్న రెండు కుక్కు పిల్లలపై ఓ పాము బుసలు  కొడుతూ తన పంజా విసిరింది. దీంతో ఆ కుక్క పిల్లలు  అక్కడికక్కడే  ప్రాణాలు విడిచాయి. పామును  చూసిన తల్లి శునకం దాన్ని తరిమే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే రెండు కుక్క పిల్లలు ప్రాణాలు విడిచాయి. ఈ సంఘటన  నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది.


నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయంలోని పచ్చిక బైళ్ళు ఉన్న ఖాళీ ప్రాంతంలో ఓ శునకం మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ప్రాంతంలో పాములు కూడా  సంచరిస్తుంటాయి. తల్లి శునకం లేని సమయంలో పిల్లల దగ్గరకు వచ్చిన ఓ నాగుపాము రెండు పిల్లలను కాటేసింది. 

ఈ సమయంలోనే అక్కడి చేరుకున్న తల్లి  మొరుగుతూ పామును నిలువరించే ప్రయత్నం చేసింది. అయిన లాభం లేకపోయింది అప్పటికే ఆ శునక పిల్లలు ప్రాణాలు విడిచాయి. కుక్క అరుపులు విన్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడ వెళ్ళి చూశారు. బుసలు కోడుతున్న పామును చూసి వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. 


14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఖాళీగా స్థలం ఎక్కువగానే ఉంది. ఈ ప్రాంతంలో తరుచూ పాములు సంచరిస్తుంటాయి. ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్సుల కోసం వచ్చే వారిని సిబ్బందిని అవి నిత్యం తిరుగుతూ  భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.