చిరు ఆఫీసు ముందు ఉయ్యాలవాడ వంశీయుల ఆందోళన (వీడియో)
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్యాలవాడ వంశీ యులు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లోగ చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.సైరా నరసింహారెడ్డి సినిమా తీసేందుకు కావలసిన పూర్తి సమాచారంతో పాటు ,సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్ లతో పాటు, నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పూర్తిగా తమనుండి తెలుసుకొన్నారని వారు చెప్పారు.

సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.