టీడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ టిడిపిలోకి ఆహ్వానించడంపై కూడా వంశీ స్పందించారు.
హైదరాబాదులోొని ఆరాంఘర్ చౌరస్తా బస్ స్టాపులో అకస్మాత్తుగా కుప్పకూలిన యువకుడికి రాజశేఖర్ అనే కానిస్టేబుల్ సిపిఆర్ చేసి ప్రాణదానం చేశాడు. అసలు సీపీఆర్ అంటే ఏమిటో చూద్దాం.
ఐసిసి మహిళల ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో తన రన్నవుట్ మీద నస్సీర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యకు హర్మన్ ప్రీత్ కౌంటర్ ఇచ్చారు. అది ఆయన ఆలోచన పద్ధతి అని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాది అంత:పురం కుట్రేనని చంద్రబాబు అన్నారు. అవినాష్ రెడ్డి అమాయకుడనే మాట నిజం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పొత్తుల వ్యాఖ్యలతో కలకలం రేపిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పరోక్ష హెచ్చరిక చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బ తీసే వ్యాఖ్యలు చేయవద్దని హుకుం జారీ చేశారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో రామాలయాలు నిర్మిస్తామని ఆయన చెప్పారు. భద్రాచలంలో ఆయన ఆ విషయం చెప్పారు.
గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ బయలుదేరి గోదావరి ఎక్స్ ప్రెస్ ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో పట్టాలు తప్పింది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ గతంలో వరంగల్ సభలో చేసిన ప్రకటన కీలకంగా మారింది.
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ బిజెపికి అస్త్రంగా మారాయి. బండి సంజయ్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నసంఘటన చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక సిపిఐ నాయకులు రేవంత్ రెడ్డితో మాట్లాడిన సంఘటన అది.