Asianet News TeluguAsianet News Telugu

యువకుడికి ప్రాణం పోసిన రాజశేఖర్: సిపిఆర్ అంటే ఏమిటి?

హైదరాబాదులోొని ఆరాంఘర్ చౌరస్తా బస్ స్టాపులో అకస్మాత్తుగా కుప్పకూలిన యువకుడికి రాజశేఖర్ అనే కానిస్టేబుల్ సిపిఆర్ చేసి ప్రాణదానం చేశాడు. అసలు సీపీఆర్ అంటే ఏమిటో చూద్దాం.

Constable Rajasekhar: What is CPR in medical terms
Author
First Published Feb 25, 2023, 12:13 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజశేఖర్ అనే కానిస్టేబుల్ కుప్పకూలిన యువకుడికి ప్రాణదానం చేయడం హాట్ టాపిక్ గా మారింది. సిపిఆర్ చేసి అతను ఓ యువకుడి ప్రాణాలు కాపాడాడు. హైదరాబాద్ లోని ఆరాంఘర్ లోని బస్ స్టాపులో నించున్న ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 

దాన్ని గమనించిన రాజశేఖర్ వెంటనే సిపిఆర్ చేశాడు. దాంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రాజశేఖర్ అనే కానిస్టేబుల్ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అభినందిస్తూ పోలీసులందరికీ సిపిఆర్ లో శిక్షణ ఇస్తామని ప్రకటించారు.వైద్య పరిభాషలో సిపిఆర్ అంటే ఏమిటి, సిపిఆర్ చేస్తే గుండి తిరిగి కొట్టుకోవడం ప్రారంభిస్తుందా అనేది చూద్దాం.

సిపిఆర్ లో ఏడు అంశాలు ఉంటాయి. ప్రమాదాన్ని తనిఖీ చేయడం, సహాయం కోసం సంప్రదించడం, బాధితుడి ఎయిర్ వేను పరిశీలించడం, రెండు రెస్క్యూ బ్రీత్స్ ఇవ్వడం, చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం, అందుబాటులో ఉంటే కంప్రెషర్ తో స్విచ్ రోల్స్, ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే వకు కంప్రెషన్స్ ను కొనసాగించడం.  

కంప్రెషన్స్ వల్ల గుండెకు, మెదడుకు, ఇతర అవయవాలకు రక్తప్రసరణ జరుగుతుంది. సిపిఆర్ అనేది 30 చెస్ట్ కంప్రెషన్స్ తోనూ రెండు రెస్క్యూ బ్రీత్స్ తోనూ ప్రారంభమవుతుంది. సిపిఆర్ ను కార్డియోపల్మనరీ రిససెటేషన్ అంటారు. ఛాతీపై చేతులతో కుదుపులు ఇస్తూ బాధితుడి నోటికి నోరు అందించి గట్టిగా గాలి ఊదాలి. 

సిపిఆర్ అనేది ఆకస్మిక గుండెపోటు వచ్చినప్పుడు పూర్తి గుండె తిరిగి పని చేయడానికి ఉపకరించదు. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మెదడుకు, ఇతర అవయవాలకు కనిష్టంగా ఆక్సిజన్ అందించడానికి మాత్రమే పనిచేస్తుంది. వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చి బాధితుడు తిరిగి ప్రాణం పోసుకోవడానికి ఉపయోగపడుతుంది. చెస్ట్ కంప్రెషన్స్ సమర్థంగా పనిచేయడానికి 2 నిమిషాల పాటు సిపిఆర్ చేయాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios