అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పోలీసు అధికారులతో మాట్లాడారు.శుక్రవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వివేకానంద రెడ్డి మృతిపై డీజీపీతో ఆరా తీశారు.

వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సంబంధించి డీజీపీతో పాటు కడప జిల్లా పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడి వివరాలను ఆరా తీశారు.వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఆ పార్టీకి చెందిన నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. 

ఈ తరుణంలో సిట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు డీజీపీని ఆదేశించారు.  సీఎం ఆదేశాల మేరకు వివేకానంద మృతిపై  అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు.

వివేకానంద కుటుంబసభ్యులకు చంద్రబాబునాయుడు ప్రగాఢసానుభూతిని తెలిపారు. గురువారం నాడు రాత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం