Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణను ధనిక రాష్ట్రంగా నువ్వు చేశావా నాశ్రమే కారణం, ముందు మాకివ్వాల్సిన లక్ష కోట్లు ఇవ్వు: కేసీఆర్ పై చంద్రబాబు

తన కృషి, త్యాగం, పోరాట ఫలితమే నేడు తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందని చెప్పుకొచ్చారు. అలాంటి తనను హేళనగా మాట్లాడతారా అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రూ.500కోట్లు ఇస్తామంటూ హేళన చేస్తావా అంటూ నిలదీశారు. 

ap cm chandrababu anidu fires on telangana cm kcr
Author
Amaravathi, First Published Mar 13, 2019, 9:20 PM IST

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమంటూ పదేపదే చెప్పుకుంటున్న కేసీఆర్  
తెలంగాణ ధనిక రాష్ట్రం అవ్వడంలో కేసీఆర్ పాత్ర ఏమాత్రం లేదన్నారు. 

తన కృషి, త్యాగం, పోరాట ఫలితమే నేడు తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందని చెప్పుకొచ్చారు. అలాంటి తనను హేళనగా మాట్లాడతారా అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రూ.500కోట్లు ఇస్తామంటూ హేళన చేస్తావా అంటూ నిలదీశారు. 

సైబరాబాద్ తానే నిర్మించానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. చెట్టు తాను నాటితే పండు మీరు తింటున్నారని విరుచుకుపడ్డారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి లక్ష కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ముందు ఆ లక్షకోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో తాము వదిలేసుకున్న ఆస్తులు, భవనాలు ఇతర సంస్థల విలువలు కలిపి లక్ష కోట్లు వరకు రావాల్సి ఉంటుందన్నారు. తమకు లక్ష కోట్లు ఇవ్వాల్సింది పోయి తాము ఇవ్వాలంటూ కేసీఆర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. 

హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అయితే కేసీఆర్ తిట్లు, చీవాట్లు భరించలేక ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ వచ్చేసినట్లు తెలిపారు. అమరావతిలోని ఇరిగేషన్ ఎస్.ఈ కార్యాలయాన్ని సెక్రటేరియట్ గా చేసుకుని పాలించామని ఆఖరికి బస్సులో ఉండి పాలన చేపట్టానని చెప్పుకొచ్చారు. 

తెలంగాణలో ఉంటూ కేసీఆర్ తో చీవాట్లు తినే ఖర్మ తనకు కానీ తన ప్రజలకు గానీ లేదన్నారు. అందువల్లే తాను అమరావతికి వచ్చేశామన్నారు. తమకు రావాల్సిన లక్ష కోట్లపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఇప్పించాల్సి ఉందని కానీ మోదీ కూడా కేసీఆర్, వైఎస్ జగన్ తో కలిసిపోయారన్నారు. 

కేంద్రం కూడా చేతులెత్తేస్తే తాముకోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. కోర్టులను ఆశ్రయిస్తే ఏళ్ల తరబడి వాయిదాలు పడతాయని అప్పటి వరకు కేసీఆర్ తో తిట్లు భరించలేకే తాను అమరావతి వచ్చేశామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మోడీ చౌకీదార్ కాదు చోర్ కీ దార్, జగన్ జుట్టు పట్టుకుని ఆడిస్తున్నావ్: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

 

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ చౌకీదార్ కాదని చోర్ కీ దార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా స్వర్ణాంధ్రప్రదేశ్‌ను స్కామ్ ల ఆంధ్రాగా చెయ్యాలంటే జగన్ కు ఓటెయ్యాలని, స్కీముల ఆంధ్రాగా చెయ్యాలంటే తమకు ఓటెయ్యాలన్న విషయాన్ని గుర్తుకు తెచ్చారు. 

దేశానికి కాపలాదారుగా చెప్పుకునే మోదీ అవినీతిపరులకు కాపలాకాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తో  కలిసి ఏపీని స్కామాంధ్రగా చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

వైఎస్ జగన్ అక్రమాలపై ఆనాటి ఈడీ కల్నల్ సీబీఐకు లేఖ రాస్తే దానిపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ను కు మోదీ అండగా ఉంటున్నారంటూ ధ్వజమెత్తారు. అవినీతిపరులకు అండగా ఉంటూ నీతిపరులను వేధిస్తారా అంటూ మండిపడ్డారు. తమను మానసిక క్షోభకు గురి చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. 

ఈడీ సీబీఐకు లేఖ రాసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వైఎస్ జగన్ ఆస్తులపై కేసును ఎందుకు పట్టించుకోవడం లేదో దేశవ్యాప్తంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి పరుడైన జగన్ జుట్టు చేత్తో పట్టుకుని ఏపీలో కుట్రలు చేసేందుకు మోదీ కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ఫ్యాన్ కంటే కేఏ పాల్ ఫ్యాన్ పవర్ ఫుల్: చంద్రబాబు

జగన్ ను బానిసగా చేసుకుని మా రాష్ట్రంపై పెత్తనం చేస్తే.... : కేసీఆర్ కు చంద్రబాబు వార్నింగ్

జనసేనతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నన్ను దెబ్బకొట్టాలనుకున్నారు, అవకాశంగా మలచుకున్నా : ఎన్నికల షెడ్యూల్ పై చంద్రబాబు

ఆ ముద్దాయి వైసీపీలో చేరాడు, పోటీ చేస్తారట: పీవీపిపై చంద్రబాబు వ్యాఖ్యలు

డీజీపీ గోడ కూలిపించావ్, వైఎస్ జగన్ భూ దందా కనిపించడం లేదా: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం

 

Follow Us:
Download App:
  • android
  • ios