అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తానుండగా ఏపీలో కేసీఆర్ ఆటలు సాగనివ్వనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

జగన్‌ను బానిసగా చేసుకుని మోదీ, కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారంటూ మండిపడ్డారు. దొంగ వ్యాపారాలు, బోగస్‌ షేర్లు, ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్‌ వంటి నేరాలు చేసిన ఆర్థిక ఉగ్రవాదిని అడ్డంపెట్టుకుని ఏపీపై కుట్ర జరుపుతావా అంటూ ధ్వజమెత్తారు. 

ఏపీ ప్రయోజనాలకు కేసీఆర్ అడ్డుపడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక  మూలాలను దెబ్బతీయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీలో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు ఊడిగం చేసినట్టేనని విమర్శించారు. 

జగన్ కు ఓటేస్తే మరణశాసనం రాసుకున్నట్లేనని ఆరోపించారు. జగన్ కు ఓటేస్తే రేపు కేసీఆర్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ జగన్ పెట్టాల్సిందేనని చెప్పుకొచ్చారు. కాళ్లు మెుక్కుతా బాంఛ అంటూ వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు సరెండర్ అయ్యారని ఆరోపించారు. 

జగన్ అక్రమాలను అడ్డుపెట్టుకుని బెదిరించి ఏపీలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నితే తిప్పికొడతామన్నారు. రూల్స్ కు విరుద్ధంగా ఐటీ గ్రిడ్స్ సంస్థపై దాడి చేసి తమ డేటా దోచుకెళ్లావని ఆ హక్కు ఎవరు ఇచ్చారంటూ మండిపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జనసేనతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నన్ను దెబ్బకొట్టాలనుకున్నారు, అవకాశంగా మలచుకున్నా : ఎన్నికల షెడ్యూల్ పై చంద్రబాబు

ఆ ముద్దాయి వైసీపీలో చేరాడు, పోటీ చేస్తారట: పీవీపిపై చంద్రబాబు వ్యాఖ్యలు

డీజీపీ గోడ కూలిపించావ్, వైఎస్ జగన్ భూ దందా కనిపించడం లేదా: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం