అమరావతి: ప్రజాశాంతి పార్టీ గుర్తుపై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్  కంటే కేఏ పాల్ పార్టీ ఫ్యాన్ చాలా పవర్ ఫుల్ అంటూ చెప్పుకొచ్చారు. 

జగన్ ఫ్యాన్ రూమ్ లో ఉంటే కేఏ పాల్ ఫ్యాన్ హెలికాప్టర్ ఫ్యాన్ అని అది చాలా పవర్ ఫుల్ అంటూ సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఏపీలో ఉంటే స్విచ్ తెలంగాణలో ఉందని ఫీజు మాత్రం ఢిల్లీలో ఉందంటూ సెటైర్లు వేశారు చంద్రబాబు నాయుడు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయోద్దని చెప్పుకొచ్చారు. తాను ప్రజల బాధ్యత నాబాధ్యతగా ఓట్లు అడుగుతుంటే నా భవిష్యత్ మీ బాధ్యత అంటూ జగన్ ఓట్లు అడుగుతున్నారంటూ విమర్శించారు. 

కేసులకు భయపడ్డ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే కేసుల నుంచి తప్పించుకునే అవకాశం దొరుకుతుందని కేసీఆర్, ప్రధాని మోదీతో కలిసి కుట్రలు పన్నుతున్నారంటూ చంద్రబాబు డైలాగులు వేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ను బానిసగా చేసుకుని మా రాష్ట్రంపై పెత్తనం చేస్తే.... : కేసీఆర్ కు చంద్రబాబు వార్నింగ్

జనసేనతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నన్ను దెబ్బకొట్టాలనుకున్నారు, అవకాశంగా మలచుకున్నా : ఎన్నికల షెడ్యూల్ పై చంద్రబాబు

ఆ ముద్దాయి వైసీపీలో చేరాడు, పోటీ చేస్తారట: పీవీపిపై చంద్రబాబు వ్యాఖ్యలు

డీజీపీ గోడ కూలిపించావ్, వైఎస్ జగన్ భూ దందా కనిపించడం లేదా: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం