అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఏపీలో రాజకీయ పార్టీల్లో సందడి మెుదలైంది. అయితే పొత్తులపై ఆయా పార్టీలు క్లారిటీ ఇస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. 

ఇకపోతే తాము వామపక్ష పార్టీలతోనే తప్ప ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే గత కొంతకాలంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు జనసేన పార్టీపై కానీ, పవన్ కళ్యాణ్ పై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యకపోవడంతో రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 

అయితే జనసేనతో పొత్తుపై చంద్రబాబు నాయుడు తేల్చిపారేశారు. జనసేనతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో తమ పార్టీ తరపున జాతీయ నాయకులు ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. 

త్వరలో ఢిల్లీలో జాతీయ పార్టీలతో సమావేశం జరగనుందని ఆ సమావేశంలో తమ తరపున ఎవరు ప్రచారం చేస్తారో క్లారిటీ ఇస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే అభ్యర్థులు ఎంపిక చేశామని త్వరలోనే ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నన్ను దెబ్బకొట్టాలనుకున్నారు, అవకాశంగా మలచుకున్నా : ఎన్నికల షెడ్యూల్ పై చంద్రబాబు

ఆ ముద్దాయి వైసీపీలో చేరాడు, పోటీ చేస్తారట: పీవీపిపై చంద్రబాబు వ్యాఖ్యలు

డీజీపీ గోడ కూలిపించావ్, వైఎస్ జగన్ భూ దందా కనిపించడం లేదా: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం