అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పీవీపీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆస్తుల కేసులో పొట్లూరి వరప్రసాద్ ఓ కేసులో ముద్దాయి అంటూ చెప్పుకొచ్చారు. 

అలాంటి ముద్దాయిలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ విరుచుకుపడ్డారు. వైసీపీలో చేరడమే కాదు రేపో మాపో వైసీపీ నుంచి విజయవాడలో పోటీ చేస్తారంట అంటూ చెప్పుకొచ్చారు. 

వైఎస్ జగన్ ఆర్థిక ఉగ్రవాది అని అలాంటి వ్యక్తికి ఓటెయ్యోద్దంటూ పిలుపునిచ్చారు. ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

డీజీపీ గోడ కూలిపించావ్, వైఎస్ జగన్ భూ దందా కనిపించడం లేదా: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం