అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో మెుదటి దశలో ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ఓ కుట్ర అంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తొలివిడతగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. 

తనను దెబ్బతియ్యాలని చూసినా తాను అవకాశంగా మలచుకుంటానని తెలిపారు. ముందుగా ఎన్నికలు పెట్టి మంచి పని చేశారని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఎన్నికలకు వెళ్లేందుకు సమయం సరిపోదన్నారు. 

ఆ సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించే మెుదటి షెడ్యూల్ లోనే ఎన్నికలు పెట్టారంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు. సమయం తక్కువైనా పర్లేదన్నారు. ఎలాంటి సంక్షోభాలను అయినా సరే ఒక అవకాశంగా మలచుకుంటానని అది ఎన్నోసార్లు నిరూపించానని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ ముద్దాయి వైసీపీలో చేరాడు, పోటీ చేస్తారట: పీవీపిపై చంద్రబాబు వ్యాఖ్యలు

డీజీపీ గోడ కూలిపించావ్, వైఎస్ జగన్ భూ దందా కనిపించడం లేదా: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం