అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులకు అండగా ఉంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆర్థిక నేరస్థుడు అయిన వైఎస్ జగన్ కు అండగా ఉంటారా అంటూ మండిపడ్డారు. 

ఒక మహానాయకుడిగా బిల్డప్ ఇచ్చే కేసీఆర్ తమపై ఒంటికాలిపై లేచే చంద్రబాబుకు జగన్ అక్రమాలు ఎందుకు కనబడవో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లాలూచీ రాజకీయాలకు ఇదే నిదర్శనమంటూ చెప్పుకొచ్చారు.  

తెలంగాణలో వైఎస్ జగన్ చేసిన అక్రమాలు, భూదందా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏపీ డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా గోడ కట్టారని ఆరోపిస్తూ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కి చెందిన గోడను కూలగొట్టిన కేసీఆర్ కు వైఎస్ జగన్ అక్రమంగా దోచుకున్న భూమలు కనిపించడం లేదా అని నిలదీశారు. 

కూకట్ పల్లిలో నాలెడ్జ్ సిటీ పేరుతో 100 ఎకరాల కుంభకోణం కేసీఆర్ కు కనిపించడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ డీజీపీ ప్రభుత్వ భూమిలో గోడకడితే కోర్టు స్టే ఉన్నా పట్టించుకోకుండా ధ్వంసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి కరుడు గట్టిన ఆర్థిక ఉగ్రవాది వైఎస్ జగన్ అక్రమాలు కనిపించడం లేదా అని నిలదీశారు. 

 
ఈ వార్తలు కూడా చదవండి

నేరాల్లో గ్రాండ్ మాస్టర్ వైఎస్ జగన్, చుట్టూ ఉన్నవాళ్లు క్రిమినల్స్ : చంద్రబాబు ధ్వజం