మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి భార్యను , కూతురును కూడ లొంగదీసుకొని జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.
ఎమ్మిగనూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి భార్యను , కూతురును కూడ లొంగదీసుకొని జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. వివేకాను హత్య చేసి సాక్ష్యాలను తారు మారు చేశారని బాబు ఆరోపించారు.
బుధవారం నాడు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేశారని చంద్రబాబునాయుడు విమర్శించారు. రౌడీలకు కొందరు పోలీసులు కూడ భయపడే పరిస్థితి ఉంటుందన్నారు. కానీ, మరికొందరు పోలీసులు రౌడీలకు కూడ భయపడరని చెప్పారు.
తమ ప్రాణాలను కూడ లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులను చంద్రబాబునాయుడు అభినందించారు. జగన్‌కు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. తెలంగాణ పోలీసులపైనే జగన్ నమ్మకం ఉందని ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు.జగన్ కేసీఆర్‌కు ఊడిగం చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు.
వైసీపీ ఫిర్యాదు చేయగానే కనీసం నోటీసులు కూడ ఇవ్వకుండానే ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్నికల సంఘం విధులతో సంబంధం లేని అధికారులను కూడ బదిలీ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు
గుండెపోటు అని చెప్పిందెవరు: వైఎస్ వివేకా హత్యపై కూతురు సునీతా రెడ్డి
తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు
నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్
వివేకా హత్యపై జగన్ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం
తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు
వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు
వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ
తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి
వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు
శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు
