న్యూఢిల్లీ: తన తండ్రి హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని దర్యాప్తు సంస్థతో చేయించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి డిమాండ్ చేశారు.

శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన‌ర్‌ను కలిసి  వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని కోరారు. అయితే ఈ విషయమై కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలవాలని  సీఈసీ సునీల్ ఆరోరా సూచించారని ఆమె చెప్పారు.

సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టులో పిట్ దాఖలు చేయాలని సీఈసీ సూచించారన్నారు. సీబీఐ దర్యాప్తు కోసం తన తల్లి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆమె తెలిపారు. 

సిట్ దర్యాప్తు వివరాలను  అధికారులు ఎప్పటికప్పుడు డీజీపీ, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తున్నారని ఆమె ఆరోపించారు. నాన్న హత్యపై బాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సునీతారెడ్డి చెప్పారు.  మా నాన్న హత్యను రాజకీయంగా వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆమె టీడీపీపై మండిపడ్డారు.

తన తండ్రి హత్య కేసులో మా వాళ్లను ఇరికిస్తారనే భయం ఉందని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కూడ కోరారు. సీఈసీ సూచన మేరకు ఆమె కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గోబను కలిసి ఈ కేసు విచారణను పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె కోరారు.

సంబంధిత వార్తలు

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు