హైదరాబాద్: తన తండ్రి గుండెపోటుతో చనిపోయారని ఎవరు ప్రచారం చేశారో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పుకారును ప్రచారం చేసిన వారిని గుర్తించి  కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. మా నాన్న హత్యను రాజకీయ నేతలు తమ ప్రయోజనం కోసం వాడుకొంటున్నారని ఆమె ఆరోపించారు.

బుధవారం నాడు ఆమె హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తన తండ్రి హత్యకు గురైతే గుండెపోటుతో చనిపోయారని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి హత్య కేసులో పరమేశ్వర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు. 

పరమేశ్వర్ రెడ్డికి మంత్రి ఆదినారాయణరెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ విషయాలను తాను సిట్ బృందానికి వివరించినట్టు చెప్పారు. చంద్రబాబునాయుడు మంత్రి ఆదినారాయణరెడ్డిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు.

మా ఫ్యామిలీలో ఎవరైనా తప్పు చేసి ఉంటే  చంద్రబాబునాయుడు ఎందుకు బయటపెట్టేవారు కాదా అని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఈ హత్యతో సంబంధం ఉందని ఎలా చెబుతున్నారని  ఆమె ప్రశ్నించారు. తన తండ్రి హత్యను రాజకీయాలకు వాడుకొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే తాను మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆమె వివరించారు.

సంబంధిత వార్తలు

తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు