Asianet News TeluguAsianet News Telugu

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన భార్య సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టును సోమవారం నాడు ఆశ్రయించింది. ఈ హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆమె ఆ పిటిషన్‌లో కోరారు.
 

ys sowbhagyamma files petition for cbi inquiry on ys vivekananda reddy murder case
Author
Amaravathi, First Published Mar 25, 2019, 1:14 PM IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన భార్య సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టును సోమవారం నాడు ఆశ్రయించింది. ఈ హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆమె ఆ పిటిషన్‌లో కోరారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్మమ్య సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.

మూడు రోజుల క్రితం న్యూఢిల్లీలో ఈ కేసు విషయమై సీఈసీని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు  సునీతారెడ్డి కలిశారు. సీఈసీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గోబాను కలిశారు.

ఇదే కేసు విషయమై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు ఇంకా నెంబర్ కేటాయించలేదు. దీంతో సౌభాగ్యమ్మ కూడ సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తుపై సునీతారెడ్డి ఆరోపణలు చేశారు. ఏపీ పోలీసులతో సంబంధం లేని థర్డ్‌పార్టీ ఎంక్వైరీని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

Follow Us:
Download App:
  • android
  • ios