శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కోసం ఉపయోగించిన వేటకోడవలిని పోలీసులు గుర్తించారు. పులివెందులకు సమీపంలోని అరటితోటలో ఈ వేటకోడవలిని గుర్తించారు పోలీసులు.

police found knife in farm house near pulivendula


పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కోసం ఉపయోగించిన వేటకోడవలిని పోలీసులు గుర్తించారు. పులివెందులకు సమీపంలోని అరటితోటలో ఈ వేటకోడవలిని గుర్తించారు పోలీసులు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు భారీగా డబ్బులు చేతులు మారినట్టుగా ప్రచారం సాగుతోంది. హత్య జరిగిన రోజున వివేకా  ఇంటి పరిసరాల్లోనే శేఖర్ రెడ్డి ఉన్నట్టుగా సిట్ బృందం గుర్తించింది.

గతంలో రంగేశ్వర్ రెడ్డి హత్య కేసులో కూడ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి నిందితుుడుగా ఉన్నాడు.  గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి వద్ద భారీగా డబ్బులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం.  రంగేశ్వర్ రెడ్డిని ఏ రకంగా హత్య చేశారో వైఎస్ వివేకానందరెడ్డిని కూడ అదే రకంగా హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

దీంతో శేఖర్ రెడ్డిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా  సమాచారం. వివేకా హత్య జరిగిన తర్వాత నుండి ఆయన సన్నిహితుడు గంగిరెడ్డి పోలీసుల అదుపులోనే ఉన్నారు. గంగిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పరమేశ్వర్ రెడ్డిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్ననారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios