హైదరాబాద్: తన తండ్రి మరణించిన  డెత్ స్పాట్‌లో ఏం జరిగిందో పులివెందుల సీఐకి అన్నీ తెలుసునని ఆయన కూతురు డాక్టర్ సునీతారెడ్డి  ఆరోపించారు. వివేకానందరెడ్డి మృతి విషయాన్ని ఉదయమే 6:40 గంటలకు సమాచారం ఇచ్చినట్టుగా ఆమె తెలిపారు

హైద్రాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. జగనన్న సీఎం కావడానికి, అవినాష్ రెడ్డి మరోసారి ఎంపీగా అయ్యేందుకు నాన్న చాలా కష్టపడుతున్నాడని ఆమె వివరించారు. తన తండ్రి హత్య దర్యాప్తులో అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ నెల 14వ తేదీన ఆసుపత్రిలో చేరిన పరమేశ్వర్ రెడ్డి  తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. ఛాతీ నొప్పి పేరుతో పరమేశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చేరారని ఆమె చెప్పారు. తనకు వివేకానందరెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని  ఆసుపత్రిలో చెప్పారన్నారు. ఆసుపత్రిలో చేరిన రోజంతా ఫోన్‌లోనే ఆయన గడిపాడన్నారు.

కానీ, అదే రోజు డాక్టర్ల సలహాకు వ్యతిరేకంగా  డిశ్చార్జీ అయ్యాడన్నారు. అయితే కొద్దిసేపటికే ఆయన సమీపంలోని ఓ హోటల్‌లో టీడీపీ నేతలతో చర్చించిన తర్వాత  ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరాడన్నారు.

ఈ నెల 15వ తేదీన ఉదయమే ఎవరో ఓ వ్యక్తి వచ్చి ఫోన్‌లో పరమేశ్వర్ రెడ్డికి ఏదో చూపించాడని ఆమె తెలిపారు. జమ్మలమడుగులో తన తండ్రికి మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు. తన తండ్రి లేకపోతే  టీడీపీ విజయావకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి  తన తండ్రిని హత్య చేసి ఉంటారని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు.

సిట్  బృందం అడిగిన ప్రతీ సమాచారాన్ని తాను ఇచ్చినట్టు ఆమె తెలిపారు. తన తండ్రి చనిపోతే  తమ కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారని ఆరోపించడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు