తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉందని తేలితే పులివెందుల పట్టణంలో ఉరితీయాలని  పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సతీష్ రెడ్డి కోరారు.

tdp leader satish reddy senstional comments on ysrcp leaders


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉందని తేలితే పులివెందుల పట్టణంలో ఉరితీయాలని  పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సతీష్ రెడ్డి కోరారు.

బుధవారం నాడు పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందులలో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఘటనపై చర్చకు తాను సిద్దమేనని ఆయన స్పష్టం చేశారు.  వివేకానంద రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తాను ప్రచారాన్ని నిలిపివేసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ, అదే రోజు మధ్యాహ్నం 11 గంటలకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి చేసిన ఆరోపణలపై సతీష్ రెడ్డి మండిపడ్డారు.

వివేకా హత్యకు తాను, చంద్రబాబునాయుడు, లోకేష్, ఆదినారాయణరెడ్డిలు కారణమని ప్రకటించడం రాజకీయం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి సమయంలోనూ వైసీపీ నేతలు టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. 

వివేకానందరెడ్డి చనిపోయిన రోజు నుండి తామెవరం కూడ ఆయనకు వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడ చేయలేదన్నారు. తమపై తప్పుడు ఆరోపణలను మానుకోవాలని సతీష్ రెడ్డి వైసీపీ నేతలకు సూచించారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios