విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి విచారణను వేగవంతం చేస్తోంది సిట్. అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో హైదరాబాద్ చేరేందుకు ఎయిర్ పోర్ట్ లాంజ్ లో వైఎస్ జగన్ ఉన్నారు. 

ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడు వైఎస్ జగన్ ను టీ ఇస్తూ పలకరించారు. తాను వైఎస్ జగన్ అభిమానినని చెప్పుకొచ్చారు. ఏపీలో 160 సీట్లు వైసీపీ గెలుస్తుందా సార్ అంటూ ప్రశ్నించారు. 

సెల్ఫీ తీసుకుంటానని చెప్పి తాను తెచ్చుకున్న కోడి పందాల కత్తెతో జగన్ పై దాడి చేశారు. ఈ దాడి ఘటనలో జగన్ భుజానికి గాయమైంది. దాదాపు 9 కుట్లు పడ్డాయి. 17 రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు జగన్. ఇకపోతే జగన్ పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశ వ్యాప్తంగా కీలకంగా మారింది. 

వైఎస్ జగన్ పై దాడికి సంబంధించి విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. రంగంలోకి దిగిన సిట్ బృందం పలువురిని సంప్రదించి వివరణ తీసుకుంది. అలాగే నిందితుడు శ్రీనివాసరావును సైతం విచారించింది. అయితే జగన్ పై దాడికి సంబంధించి కత్తిని స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపారు సిట్ అధికారులు. 

అయితే ఆ దాడిలో  కీలక ఆధారమైన జగన్ వేసుకున్న షర్ట్ మాత్రం ఇప్పటికీ సిట్ అధికారులకు చేరలేదు. ఇటీవలే విశాఖ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్  కోర్టు కూడా జగన్ షర్ట్ పై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జగన్ పై దాడి  కేసుకు సంబంధించి విశాఖ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్  కోర్టులో విచారణ జరగగా ఆ సమయంలో జగన్ తరపున లాయర్ జగన్ షర్ట్ ను కోర్టుకు సమర్పించారు. 

అయితే ఆ షర్ట్‌ను సిట్ అధికారులకు ఇవ్వొద్దని జగన్ తరపున న్యాయవాది కోరారు. హైకోర్టులో రిట్ పిటిషన్‌పై విచారణ జరిగే వరకు సీల్డ్ కవర్‌లోనే షర్ట్ ఉంచాలని కోరారు. 

మరోవైపు జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును విశాఖ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్  కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. శుక్రవారంతో కస్టడీ ముగియడంతో దాన్ని పొడిగించింది. అయితే శ్రీనివాసరావుకు 14 రోజులు  అంటే డిసెంబర్ 7 వరకు  జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.  

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడి కేసు: సిట్ విచారణకు గడువు కోరిన జగన్

దాడి కేసులో వాంగ్మూలంపై దిగొచ్చిన జగన్

దాడి: జగన్‌‌కు నోటీసులు జారీ చేసిన సిట్

జగన్ చొక్కా ఇస్తేనే.. రహస్యం బయటపడుతుంది: దేవినేని

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్

పోలవరంలో అవినీతి, అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం: బాబుపై జగన్ ఫైర్

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు