అతి త్వరలోనే కోడికత్తి నాటకం బయటపడుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దాడి జరిగిన 23 రోజుల తర్వాత వైసీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదన్నారు..

తనపై కుట్రలు పన్నారని సీఎంని.. డీజీపీని ముద్దాయిలుగా పేర్కొనడం సబబుకాదన్నారు. జగన్‌పై దాడి కేసు విషయంలో పోలీస్ విచారణ సక్రమంగానే జరుగుతోందన్నారు.. దాడి జరిగిన వెంటనే ప్రతిపక్షనేత పోలీసులకు సహకరించలేదని.. వివరాలు సేకరించేందుకు పోలీసులు పలుమార్లు ప్రయత్నించినా జగన్ ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా రక్తపు మరకలు పడిన చొక్కాను పోలీసులకిచ్చి సహకరించాలని దేవినేని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని... ఆంధ్రా పోలీసులపై ఆయనకు నమ్మకం లేదని.. బాధ్యతలను విస్మరించి మాట్లాడటం సరికాదన్నారు.

జగన్మోహన్ రెడ్డి కోడికత్తి నాటకం త్వరలోనే బయటపడుతుందని ఉమా అన్నారు.. వైసీపీ అధినేత అవినీతిలో కూరుకుపోయి టీడీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 2019 నాటికి గోదావరి నీటిని నాగార్జున సాగర్ కుడికాలువకు మళ్లీస్తామని దేవినేని హామీ ఇచ్చారు. 

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్

పోలవరంలో అవినీతి, అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం: బాబుపై జగన్ ఫైర్

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు