విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి ఘటనపై వివరణ ఇచ్చేందుకు వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంగీకరించారు. ఇప్పటి వరకు ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించని జగన్ సిట్ మళ్లీ నోటీసులు పంపడంతో వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో సిట్ ఇచ్చిన 160సీఆర్పీసీ నోటీసులకు వైసీపీ నేతలు వివరణ ఇచ్చారు.
విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి ఘటనపై వివరణ ఇచ్చేందుకు వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంగీకరించారు. ఇప్పటి వరకు ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించని జగన్ సిట్ మళ్లీ నోటీసులు పంపడంతో వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో సిట్ ఇచ్చిన 160సీఆర్పీసీ నోటీసులకు వైసీపీ నేతలు వివరణ ఇచ్చారు.
హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందువల్ల విచారణకు హాజరయ్యేందుకు 15 రోజులు గడువు కావాలని జగన్ కోరినట్లు సిట్ కి వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ వివరణ పంపారు.
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో అక్టోబర్ 25న తనపై జరిగిన దాడిలో కుట్ర దాగి ఉందంటూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో రిట్ పిటీషన్ విచారణ రానుంది. నవంబర్ 27న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో 15 రోజులు గడువు అడిగారు.
ఏపీ పోలీసులకు జగన్ వాంగ్మూలం ఇచ్చే అంశంపై పెద్ద రచ్చే జరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఏడాది అక్టోబర్ 25న కత్తితో దాడి చేశాడు. ఈ దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.
ఈ దాడికి సంబంధించి తొలిసారి వాంగ్మూలం కోసం ఆసుపత్రిలో జగన్ ఉన్న సమయంలోనే సిట్ అధికారులు వచ్చారు. కానీ, జగన్ మాత్రం సిట్ కు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ మేరకు రాత పూర్వకంగానే వైసీపీ నేత రామకృష్ణారెడ్డి అప్పట్లో సిట్ అధికారులకు రాసి ఇచ్చారు.
తాజాగా నవంబర్ 19న సిట్ అధికారులు మళ్లీ జగన్ కు నోటీసులు జారీ చేశారు. దాడికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలని నోటీసులో కోరారు. ఈనేపథ్యంలో నవంబర్ 21న వైసీపీ నేతలు సిట్ అధికారి నాగేశ్వరావును కలిశారు. జగన్ తరపున సమాధానం ప్రతిని అందజేశారు. నోటీసుకి సమాధానం ఇవ్వడానికి కొంత గడువుకావాలని జగన్ అందులో కోరారు.
తాజాగా శుక్రవారం వైసీపీ నేత మళ్ల విజయ్ ప్రసాద్ జగన్ తరపున వివరణను పంపారు. 15 రోజులు గడువు కావాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
దాడి కేసులో వాంగ్మూలంపై దిగొచ్చిన జగన్
దాడి: జగన్‌కు నోటీసులు జారీ చేసిన సిట్
జగన్ చొక్కా ఇస్తేనే.. రహస్యం బయటపడుతుంది: దేవినేని
జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు
జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం
జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే
చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం
మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్
పోలవరంలో అవినీతి, అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం: బాబుపై జగన్ ఫైర్
జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....
