విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి ఘటనపై వాంగ్మూలం ఇచ్చేందుకు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ సిద్దపడినట్లు అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ అంగీకరించలేదు. అయితే వాంగ్మూలం కోసం సిట్‌ మళ్లీ నోటీసులు పంపడంతో జగన్ స్పందించారు.  

విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి ఘటనపై వాంగ్మూలం ఇచ్చేందుకు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ సిద్దపడినట్లు అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ అంగీకరించలేదు. అయితే వాంగ్మూలం కోసం సిట్‌ మళ్లీ నోటీసులు పంపడంతో జగన్ స్పందించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుకు జగన్ సమాధానం ఇచ్చారు. సమాధానం ప్రతిని వైసీపీ నేతలు సిట్ అధికారి నాగేశ్వరరావుకు అందించారు. నోటీసుకి సమాధానం ఇవ్వడానికి కొంత గడువుకావాలని జగన్ అందులో కోరారు. 

విశాఖ ఎయిర్‌పోర్టులో దాడికి సంబంధించి వాగ్మూలం ఇవ్వాలంటూ సిట్‌ నోటీసులకు లాయర్‌ ద్వారా జగన్ సమాధానం పంపారు. రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ తర్వాత వాంగ్మూలం ఇస్తానని జగన్‌ స్పష్టం చేశారు. ఈ నెల 27న హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ విచారణకు రానుంది. విచారణ అనంతరం జగన్ సిట్ అధికారులకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. 

ఈ దాడికి సంబంధించి తొలిసారి వాంగ్మూలం కోసం ఆసుపత్రిలో జగన్ ఉన్న సమయంలోనే సిట్ అధికారులు వచ్చారు. కానీ, జగన్ మాత్రం సిట్ కు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ మేరకు రాత పూర్వకంగానే వైసీపీ నేత రామకృష్ణారెడ్డి అప్పట్లో సిట్ అధికారులకు రాసి ఇచ్చారు.

అయితే ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులకు వాంగ్మూలం ఇస్తానని జగన్ అన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా జగన్ వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారని జోరుగా చర్చ జరిగింది. 

దీంతో జగన్ వాంగ్మూలం నిరాకరణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ పోలీసులను నమ్మకపోతే ఎలా అంటూ అధికార పార్టీతోపాటు ఇతర పార్టీలు విమర్శల దాడి చేశాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 19న మళ్లీ సిట్ అధికారులు వైసీపీ చీఫ్ జగన్ కు నోటీసులు జారీ చేశారు. దాడికి సంబంధించిన వాంగ్మూలం ఇవ్వాలని నోటీసులో కోరారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఏడాది అక్టోబర్ 25న కత్తితో దాడి చేశాడు. ఈ దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.

 వైఎస్ జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావును వారం రోజుల పాటు సిట్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. అయితే దర్యాప్తులో పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయినట్టు సిట్ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

శ్రీనివాసరావుకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని కూడ సిట్ యోచనలో ఉంది. అదేసమయంలో దాడికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ ను కోరారు. నోటీసుల విషయంపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ అంగీకరించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక విచారణ వేగవంతం కానుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

దాడి: జగన్‌‌కు నోటీసులు జారీ చేసిన సిట్

జగన్ చొక్కా ఇస్తేనే.. రహస్యం బయటపడుతుంది: దేవినేని

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్

పోలవరంలో అవినీతి, అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం: బాబుపై జగన్ ఫైర్

జగన్ తో నడవని వైఎస్ ఆత్మ ఏమంటోంది....

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు