విశాఖపట్నం: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో పురోగతి సాధించినట్లు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. జగన్ పై దాడికి కోడి పందాలుకు ఉపయోగించిన కత్తిని వాడాడని తెలిపారు. నిందితుడి దగ్గర మరో చిన్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు లడ్డా తెలిపారు.  

దాడికి వాడిన కత్తి  పొడవు 8సెం.మీలు ఉండగా ఆ కత్తిలో వాడిగా ఉన్న భాగం మూడు సెం.మీలేనని సీపీ వివరించారు. దాంతో పాటు ఘటనా స్థలంలో మరో చిన్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని అతడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనే విషయాలపై విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేశారు. 
 
నిందితుడు శ్రీనివాస్‌ ఏడాది కాలంలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చాడని అందులో ఒకే సిమ్ వాడినట్లు గుర్తించామని తెలిపారు. ఒకే సిమ్ వాడి ఎందుకు ఫోన్ లు మార్చాడో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. గతంలో జగన్ ను కలవడానికి శ్రీనివాస్ ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిపాడు. 

మరోవైపు నిందితుడి వద్ద లభించిన 11 పేజీల లేఖపై కూడా విచారించినట్లు సీపీ లడ్డా తెలిపారు. 11పేజీలలో 9 తొమ్మిది పేజీలు వరుసకు సోదరి అయ్యే విజయలక్ష్మీ అనే అమ్మాయితో రాయించాడని మరోక పేజీ తనతోపాటు రెస్టారెంట్ లో పనిచేస్తున్న అటెండర్ రేవతిపతితో రాయించినట్లు చెప్పాడని సీపీ తెలిపారు. 

చివరి పేజీ జగన్ ను చూసి హడావిడిగా తానే రాశానని శ్రీనివాస్ ఒప్పుకున్నట్లు తెలిపారు. రేవతిపతి నాలుగు నెలల క్రితం రెస్టారెంట్ లో అటెండర్ గా చేరినట్లు తెలిపారు. రేవతిపతిది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలి గ్రామంగా గుర్తించినట్లు సీపీ తెలిపారు. 

అటు విచారణలో భాగంగా ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ కు కూడా నోటీసులు జారీ చేశామని తొందర్లోనే అతనిని కూడా విచారిస్తామని తెలిపారు. అనంతరం నిందితుడు శ్రీనివాస్ ను కోర్టుకు తరలించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ