చంద్రబాబు సభలో జగన్ కు జేజేలు...షాక్ (వీడియో)

First Published 20, Feb 2018, 9:12 PM IST
Students shouted slogans in favor of ys jagan in chandrababus programme
Highlights
  • హాజరైన దగ్గర నుండి వెళ్ళిపోయే వరకూ విద్యార్ధులు ఒకటే జేజేలు కొట్టటం మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు మొహంలో ఒకటే ఆనందం.

చంద్రబాబునాయుడు హాజరైన ఓ కార్యక్రమంలో విచిత్రం చోటు చేసుకుంది. ఓ కళాశాలలో కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. అయితే, కార్యక్రమానికి చంద్రబాబు హాజరైన దగ్గర నుండి వెళ్ళిపోయే వరకూ విద్యార్ధులు ఒకటే జేజేలు కొట్టటం మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు మొహంలో ఒకటే ఆనందం. అయితే, ఆ ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది. ఎందుకంటే, వారు జేజేలు కొడుతున్నది సిఎంకు కాదు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడైతే విషయం గ్రహించారో చంద్రబాబు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు.

 

loader