‘జగన్.. భారతి తన భార్య కాదంటాడు’

minister aadi narayana sensationl comments on ycp president jagan
Highlights

మంత్రి ఆదినారాయణ సంచలన వ్యాఖ్య

వైసీపీ అధినేత జగన్ పై మంత్రి ఆదినారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.ఆస్తులు పెంచుకునేందుకే మోదీతో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 

భారతి సిమెంట్ పరిశ్రమ తనది కాదని జగన్ అంటున్నాడని.. నాలుగు రోజులు పోతే చివరకు భారతి తన భార్య కాదనే నీచ సంస్కృతి జగన్‌ది అని వ్యాఖ్యానించారు. ఉపఎన్నికలు జరిగితే జిల్లాల్లో 10అసెంబ్లీ స్థానాలు టీడీపివే అని...ఎంపీ అవినాష్‌కు ఘోర పరాభవం తప్పదని స్పష్టం చేశారు. జిల్లాలో తమ నేతల మధ్య కుమ్ములాటలు నిజమే అని, ఆ కుమ్ములాటలు పక్కనపెట్టి జిల్లాలో జగన్‌ను మట్టి కరిపిస్తామని మంత్రి ఆదినారాయణ తెలిపారు.

loader