Asianet News TeluguAsianet News Telugu

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

మానసిక ఒత్తిడి కారణంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారన్నారు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ విజయలక్ష్మీ. కేసులు పెట్టి నాన్నని వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. కోడెలను మానసికంగా క్షోభకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. 

kodela siva prasad daughter vijaya lakshmi sensational comments
Author
Narasaraopet, First Published Sep 17, 2019, 8:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మానసిక ఒత్తిడి కారణంగానే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారన్నారు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ విజయలక్ష్మీ. నరసరావుపేటలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేసులు పెట్టి నాన్నని వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు.

కోడెలను మానసికంగా క్షోభకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. కాగా సోమవారం హైదరాబాద్‌లో మాట్లాడిన ఆమె.. నాన్న అంటే తమకు ప్రాణమని.. తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రభుత్వం పెట్టిన వేధింపుల వల్లే ఆయన ప్రాణం పోయిందని.. మీ అందరికీ దండం పెడతామని, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండంటూ రోదించారు.

మరోవైపు కోడెల శివప్రసాదరావు భౌతిక కాయం గుంటూరు లోని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్‌లు కోడెలకు నివాళులర్పించారు.

తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. కోడెల పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం అక్కడే వుంచి అనంతరం ఊరేగింపుగా నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు.    

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios