ట్రాప్ చేసి బాలికపై పది రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు...

Girl trapped and raped by two persons
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. మైనర్ బాలికను ట్రాప్ చేసిన ఇద్దరు యువకులు ఒకరి తర్వాత ఒకరు పది రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన చింతలపూడిలో కలకలం రేపింది. 

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. మైనర్ బాలికను ట్రాప్ చేసిన ఇద్దరు యువకులు ఒకరి తర్వాత ఒకరు పది రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన చింతలపూడిలో కలకలం రేపింది. 
బాలిక ఉంటున్న హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. ఏలూరుకు చెందిన మైనర్ బాలిక చింతలపూడి బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కుటుంబ కలహాల నేపథ్యంలో విడివిడిగా ఉంటున్నారు. 

ఈ నెల16వ తేదీ ఉదయం హాస్టల్‌లో టిఫిన్ చేసిన తర్వాత బడికి వెళ్లిన బాలిక సాయంత్రం హాస్టల్‌కు బాలిక రాలేదు. దాంతో బాలిక తండ్రికి హాస్టల్‌ వార్డెన్  ఫోన్‌లో విషయం చెప్పింది. తల్లి వద్దకు వెళ్లి ఉంటుందని అతడు భావించాడు. 

అయితే బాలిక తల్లి వద్ద కూడా లేదని తెలియడంతో ఈనెల 20న హాస్టెల్ వార్డెన్ చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికను విచారించడంతో చోదిమెళ్ల కిరణ్ అనే వ్యక్తి తనను నమ్మించి ఏలూరు తీసుకువెళ్లాడని రాత్రంతా తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. 

తెల్లవారిన తర్వాత కిరణ్ అతడి స్నేహితుడు చిట్టిబాబుకు ఫోన్ చేసి పిలిపించి చింతలపూడిలోని హాస్టల్‌ వద్ద బాలికను వదిలి రమ్మని పురమాయించాడు. ఇదే అదునుగా భావించిన చిట్టిబాబు ఆ బాలికను ఏలూరులోని తన అక్క ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు మార్లు లైంగిక దాడి చేశాడు. 
సెల్‌ఫోన్‌లో ఆ బాలికను నగ్నంగా చిత్రీకరించి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పది రోజుల తర్వాత చిట్టిబాబు, కిరణ్ ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

నిందితులు ఇద్దరినీ చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిది పెదవేగి మండలం కవ్వగుంట గ్రామమని పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం చింతలపూడి ఆస్పత్రికి తరలించారు.

loader