నాటువైద్యం పేరుతో బాలికతో వ్యభిచారం.. మరో 11 మంది అరెస్ట్..

బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమదో చేసిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపులు  జరిపారు. ఈ ఘటనకు సంబంధించి 23 మందిని ఇదివరే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు 11మంది అరెస్టు తో .. ఇప్పటికి ఈ కేసులో మొత్తం 61మందిని అదుపులోకి తీసుకున్నారు. 

Forced prostitution with a 13-year-old girl, another 11 arrested in AP

పట్టాభిపురం : బాలికపై molestation కేసులో మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు పశ్చిమ dsp supraja ఆధ్వర్యంలో అరండల్ పేట ఇన్చార్జి సీఐ రత్నస్వామి, ఎస్.ఐ. సత్యనారాయణ తదితర సిబ్బంది ముద్దాయిలను arrest చేశారు. వీరితో కలిసి ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ రత్నస్వామి తెలిపారు. పేరిచర్లకు చెందిన బాలిక covid 19 కారణంగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. కరోనా తగ్గాక ఓ మహిళ బాలికను prostitution కూపంలోకి దింపింది. బాలిక తప్పించుకుని తండ్రి వద్దకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ జరిపి విడతలవారీగా నిందితులను అరెస్టు చేస్తున్నారు. 

మంగళవారం అరెస్టు చేసిన 11మందిలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంకు చెందిన కూనపరెడ్డి కాళిబాబు, వెంకటరాయపురానికి చెందిన కొప్పుల గణేష్, ఉండ్రాజవరానికి చెందిన బూరెల నాగరాజు, సంకురాత్రి నవీన్ కృష్ణ, నల్లజర్ల కు చెందిన గందిపాము రమేష్, ఇరగవరం మండలం రేలంగికి చెందిన పసుపులేటి వీర వెంకటదుర్గాప్రసాద్, తాడేపల్లిగూడెం లోని గణేష్ నగర్ కు చెందిన బండారు ధర్మేంద్ర, మానసాటి శివకుమార్, ఉప్పులూరుకు చెందిన ఎర్ర బాల శివ, అత్తిలికి చెందిన వెంకన్నబాబు, వెలిది నాగ వెంకట సతీష్ లు ఉన్నట్లు సీఐ వివరించారు.

కాగా, నిరుడు డిసెంబర్ 18న గుంటూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, కూతురికి corona virus సోకడంతో గుంటూరు GGHలో చేర్పించాడు ఓ భర్త. అక్కడ వారిద్దరూ చికిత్స పొందుతూ 2021, జూన్లో భార్య చనిపోయింది. guntur స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఓ మహిళ తాను ఆస్పత్రిలో నర్సు అని ఆ బాలిక తండ్రిని నమ్మించింది. నాటువైద్యం చేయిస్తానని బాలికను ఇంటికి తీసుకెళ్ళి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో prostitution చేయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం పాలైన ఆ బాలిక, ఆమెనుంచి ఎలాగో తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయం తండ్రికి చెప్పింది. తండ్రి ఫిర్యాదు మేరకు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసు స్టేషన్లో Zero FIR నమోదు చేసి కేసును అరండల్ పేట స్టేషన్ కు బదిలీ చేశారు. 

 ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితురాలు  వ్యభిచారం నిర్వాహకురాలు అని, Nurse కాదని పోలీసులు తెలుసుకున్నారు పోలీసుల కథనం ప్రకారం..  పల్నాడులోని ఓ  పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలికకు  13 ఏళ్లు. కరోనా బారిన పడి జిజిహెచ్ లో చేరింది. గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన ఓ మహిళ నమ్మించి తన వెంట ఇంటికి తీసుకెళ్లిన కొద్ది రోజులకే  వ్యభిచారం  చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఆ పని చేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి, బయటకు రానీయకుండా కొన్నాళ్ళు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడకు సైతం తీసుకెళ్లి  వ్యభిచారం  చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

కొద్దిరోజుల నుంచి అనారోగ్యం పాలవడంతో  వ్యభిచారం  నిర్వాహకురాలు ఆ బాలికను విజయవాడలో వదిలేయడంతో ఇంటికి చేరిందని అనుమానిస్తున్నారు. బాలిక తండ్రి గుంటూరులో ఓ ఫ్యాక్టరీలో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. ఆ బాలిక తప్పిపోయినట్లు సుమారు 2 నెలల క్రితం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలియడంతో నల్లపాడు పోలీసులు కేసును క్లోజ్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios