జగన్ ఏమి మాట్లాడినా సరే అధికార పార్టీ మాత్రం జగన్ గత చరిత్రను మాత్రమే ప్రస్తావించాలని నిర్ణయించింది. అందుకే ముఖ్యమంత్రి దగ్గర నుండి దిగువస్ధాయి నేతల వరకూ అరిగిపోయిన రికార్డులనే మళ్ళీ మళ్ళీ వేస్తోంది.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వం అరిగిపోయిన రికార్డునే వేస్తోంది. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ పై సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు చేసిన ఆరోపణలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నియోకవర్గంలోని రైతులతో జగన్ మాట్లాడుతూ పంటలు, సాగు విస్తీర్ణం తదితరాలకు సంబంధించి పలు ఆరోపణలు చేసారు. దానికి మంత్రి స్పందించారు. అపుడు మంత్రి ఏం చెప్పాలి? జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పాలి. కానీ దేవినేని ఆ పని చేయకుండా జగన్ గత చరిత్రను తవ్వితీసారు.

మంత్రి నియోజకవర్గంలో 18 వేల ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా కేవలం వెయ్య ఎకరాలు మాత్రమే సాగైనట్లు జగన్ ఆరోపించారు. మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్ధితి ఉండటం నిజంగా దారుణమన్నారు. ఏడాదికి నాలుగు పంటలు పండే భూములన్నీ నీరులేక ఎండిపోతున్నట్లు ధ్వజమెత్తారు. పంటల ధరలు కూడా పడిపోతున్నట్లు మండిపడ్డారు.

అయితే, తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పంటలకు నీళ్ళు ఇస్తున్నామని, ఎక్కడా ఎండిపోలేదని, పంటలన్నింటకీ గిట్టుబాటు ధరలు లభిస్తున్నట్లు చెప్పాలి. కానీ మంత్రి మాత్రం జగన్ పై ఉన్న కేసులు, 16 మాసాల చంచల్ గూడ జైలు జీవితం, బైలుపై బయటకు రావటం, ఎన్నికేసుల్లో నిందితుడు, జగన్ అవినీతి, ఉద్యమాలు చేస్తూ రాష్ట్రం ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాలు, ఇవి..మాట్లాడింది.

అంటే అర్ధమేమిటి? పంటల ఎండిపోవటం, గిట్టుబాటు ధరలు లేకపోవటం, పంటలకు నీళ్ళు ఇవ్వలేకపోవటం నిజమేనన్న మాట. జగన్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని దేవినేని కూడా అంగీకరిస్తున్నట్లే. లేకపోతే జగన్ రైతు సమస్యల గురించి మాట్లాడితే, దేవినేని మాత్రం జగన్ గత చరిత్ర గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి? అంటే ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. జగన్ ఏమి మాట్లాడినా సరే అధికార పార్టీ మాత్రం జగన్ గత చరిత్రను మాత్రమే ప్రస్తావించాలని నిర్ణయించింది. అందుకే ముఖ్యమంత్రి దగ్గర నుండి దిగువస్ధాయి నేతల వరకూ అరిగిపోయిన రికార్డులనే మళ్ళీ మళ్ళీ వేస్తోంది.