టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ అంతిమయాత్ర ముగిసింది. తిరుపతిలోని శివప్రసాద్ నివాసం నుంచి ఆయన స్వగ్రామం అరగాల వరకు ఈ అంతిమయాత్ర కొనసాగనుంది.

శివప్రసాద్ పార్థీవదేహం వెంట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, టీడీపీ నేతలు ఉన్నారు. అంతకుముందు శివప్రసాద్ నివాసానికి వెళ్లిన బాబు.. ఆయన పార్ధీవదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివప్రసాద్‌కు నివాళులర్పిస్తానని ఊహించలేదన్నారు. ఇద్దరం మంచి మిత్రులమని, డాక్టర్‌గా ఉండి కళపై మమకారం పెంచుకున్నారని, తనపై నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చారని బాబు గుర్తుచేసుకున్నారు.

ఆయన రాష్ట్రం కోసం ఎనలేని పోరాటం చేశారని, ప్రజా సమస్యలను తన కళారూపంలో తెలియజేశారని.. ఆయన ఆజాత శత్రువని పేర్కొన్నారు. 

మిత్రుడికి నివాళి.. శివప్రసాద్‌కు నివాళులర్పిస్తానని అనుకోలేదు: బాబు

అధికారిక లాంఛనాలతో శివప్రసాద్ అంత్యక్రియలు

సాయంత్రం 5 గంటలకు శివప్రసాద్ అంత్యక్రియలు: పాల్గొననున్న చంద్రబాబు

వైఎస్ రాజారెడ్డితో శివప్రసాద్‌కు సంబంధాలు: వైఎస్ఆర్ బంపర్ ఆఫర్

మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం కలచివేసింది : పవన్ కళ్యాణ్

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ నేపథ్యమిదీ

ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన

హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!