తిరుపతి:టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ కూడ ఒకే స్కూల్‌లో చదువుకొన్నారు. శివప్రసాద్ కంటే చంద్రబాబునాయుడు స్కూల్లో సీనియర్. శివప్రసాద్ జూనియర్. చదువు పూర్తైన తర్వాత కూడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది.

చిత్తూరు జిల్లా నారావారిపల్లె చంద్రబాబునాయుడుది. నారావారిపల్లెలో స్కూల్ లేకపోవడంతో చంద్రబాబునాయుడు పక్కనే ఉన్న శేషాపురం గ్రామానికి ప్రతి రోజూల నడుచుకొంటూ వెళ్లి విద్యాభ్యాసం చేసేవాడు.

నారావారిపల్లెకు పక్కనే ఉన్న మరో గ్రామం శివప్రసాద్‌ది. అయితే శివప్రసాద్ కూడ శేషాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసేవాడు. శేషాపురం స్కూల్లోనే చంద్రబాబునాయుడు 9వ తరగతి చదువుకొన్నాడు. ఆ తర్వాత ఆయన తిరుపతిలో పదవ తరగతి పూర్తి చేశాడు.

శేషాపురం స్కూల్లో చంద్రబాబునాయుడుతో శివప్రసాద్ కూడ చదువుకొన్నాడు. అయితే వీరిద్దరూ ఒకే స్కూల్లో చదువుకొన్నా వేర్వేరు తరగతుల్లో ఉన్నారు. ప్రతి రోజూ కూడ వీరిద్దరూ స్కూల్ కు కలిసి వెళ్లేవారు.

చంద్రబాబునాయుడు పదోతరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశాడు. శివప్రసాద్ మాత్రం డాక్టర్ వృత్తిపై మోజుతో అటు వైపు వెళ్లాడు.వీరిద్దరూ  పండుగల సమయాల్లో ఇంటికి వచ్చిన సమయాల్లో ఇతరత్రా సమయాల్లో కలుసుకొనేవారు. 

తోటి విద్యార్ధులతో కలిసి గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని శ్రమదానం చేయడంలో శివప్రసాద్ సహా చంద్రబాబునాయుడు కలిసి పనిచేసినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయాల్లోకి వచ్చాక టీడీపీలో చేరారు. గతంలో మంత్రిగా కూడ ఆయన పనిచేశారు. ఆ తర్వాత చిత్తూరు ఎంపీ స్థానం నుండి శివప్రసాద్ విజయం సాధించారు. ముఖాముఖి మాట్లాడుకొనే సమయంలో చిన్నతనంలో తమ గ్రామంలోని ఘటనలను వీరిద్దరూ గుర్తు చేసుకొనేవారని చెబుతారు. 


సంబంధిత వార్తలు

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన

హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!