చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
తెలుగుదేశం పార్టీ (టీడీపి) మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు.
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయ,స్సు 68 ఏళ్లు. ఆయన పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతూ శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 68 ఏళ్లు.
శనివారం మధ్యాహ్నం 2..07 గంటలకు శివప్రసాద్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివప్రసాద్ మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.
1999 నుంచి 2004 వరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు.
శివప్రసాద్ స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి. ఆయన 1951 జులై 11వ తేీద నాగయ్య, చెంగమ్మ దంపతులకు అప్పటి మద్రాసు రాష్ట్రంలో జన్మించారు. శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. అక్కడే ఆయనకు చంద్రబాబుతో పరిచయం ఏర్పడింది.
శివప్రసాద్ 2009, 2014ల్లో రెండు సార్లు టీడీపి తరఫున పోటీ చేసి లోకసభకు ఎన్నికయ్యారు. అయితే, 2019 ఎన్నికల్లో మాత్రం వైసిపి అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో ఓటమి పాలయ్యారు.
శివప్రసాద్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.