Asianet News TeluguAsianet News Telugu

అధికారిక లాంఛనాలతో శివప్రసాద్ అంత్యక్రియలు

ఆదివారం శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివప్రసాద్ మా అందరికీ అన్నలాంటి వారని ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.

AP Govt announces state funeral for Ex MP SivaPrasad
Author
Tirupati, First Published Sep 22, 2019, 1:46 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఆదివారం శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివప్రసాద్ మా అందరికీ అన్నలాంటి వారని ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.

శివప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. చిత్తూరు జిల్లా ఐతేపల్లి సమీపంలోని అరగాలలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ప్రస్తుతం ప్రజలు, కార్యకర్తల సందర్శనార్ధం ఆయన పార్థీవ దేహాన్ని తిరుపతిలోని శివప్రసాద్ నివాసంలో ఉంచారు. సాయంత్రం 4 గంటలకు ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.

శివప్రసాద్ అంతిమయాత్రలో ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

సాయంత్రం 5 గంటలకు శివప్రసాద్ అంత్యక్రియలు: పాల్గొననున్న చంద్రబాబు

వైఎస్ రాజారెడ్డితో శివప్రసాద్‌కు సంబంధాలు: వైఎస్ఆర్ బంపర్ ఆఫర్

మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం కలచివేసింది : పవన్ కళ్యాణ్

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ నేపథ్యమిదీ

ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన

హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!

Follow Us:
Download App:
  • android
  • ios