శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!

రాజకీయాల్లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శివ ప్రసాద్ కన్నుమూశారు. సినిమాల్లో ఆయన నటిస్తున్నారు అంటే ఆ పాత్ర చాలా ప్రత్యేకమైనదని ముందే  చెప్పవచ్చు.

senior actor siva prasad cine career

రాజకీయాల్లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శివ ప్రసాద్ కన్నుమూశారు. సినిమాల్లో ఆయన నటిస్తున్నారు అంటే ఆ పాత్ర చాలా ప్రత్యేకమైనదని ముందే  చెప్పవచ్చు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో తెరపై ప్రజెంట్ చేసే ఈ సీనియర్ యాక్టర్ అభిమానుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన సినీ కెరీర్ పై ఓ లుక్కిస్తే.. 

శివ ప్రసాద్ డాక్టర్ గా కొన్నాళ్ళు సేవలందించి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివ ప్రసాద్ డేంజర్ సినిమాలో విలన్ గా కనిపించి నంది అవార్డు సొంతం చేసుకున్నారు. నటుడిగా మొదట శివప్రసాద్ ఖైదీతో వెండితెరకు పరిచయం అయ్యారు. 

పిల్ల జమిందార్ - మస్కా - లక్ష్మి - తులసి - యముడికి మొగుడు - బాలు -జై చిరంజీవ వంటి సినిమాల్లో డిఫరెంట్ గా నటించి ప్రశంసలు అందుకున్నారు. చివరగా శివ ప్రసాద్ 'సై ఆట' సినిమాలో నటించారు. ఆతరువాత రాజకీయాల్లో బిజీ అవుతూ తనదైన శైలిలో అప్పుడపుడు నిరసనలో భాగంగా తన కళను ప్రదర్శించేవారు.  

మొత్తంగా 25కి పైగా సినిమాల్లో నటించిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన డైరక్ట్ చేసిన సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ 'టోపీ రాజా స్వీటీ రోజా' ఆడియెన్స్ ని మెప్పించింది. ఆ సినిమాతోనే రోజా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 

శనివారం మధ్యాహ్నం 2..07 గంటలకు శివప్రసాద్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివప్రసాద్ మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన

హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios