హైదరాబాద్:మా నాన్న హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను గంగిరెడ్డి తారు మారు చేసినట్టుగా తాము అనుమానిస్తున్నామని  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్యపై ఆయన కూతురు డాక్టర్ సునీతారెడ్డి చెప్పారు.

బుధవారం నాడు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్  సునీతా రెడ్డి ఓ తెలుగు ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వివేకానందరెడ్డి హత్యపై ఆమె పలు అనుమానాలను వ్యక్తం చేశారు. గంగిరెడ్డితో ఈ హత్యను ఎవరు చేయించారనే విషయం బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

గుండెపోటుతో నాన్న చనిపోయారని ఎవరు ప్రచారం  చేశారో తనకు తెలియదన్నారు. నాన్న చనిపోయిన విషయాన్ని తమకు పీఏ కృష్ణారెడ్డి  చెప్పారని ఆమె గుర్తు చేసుకొన్నారు.  నాన్న హత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

నాన్న హత్యతో జగన్, అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బదిలీని స్వాగతిస్తున్నానని ఆమె చెప్పారు. హత్య ఎవరు చేశారనే విషయం బయటకు రాకుండా సాక్ష్యాలను తారుమారు  చేశారనే అంశాన్ని విషయాన్ని ప్రచారం చేస్తున్నారని ఆమె టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

పరమేశ్వర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారనే విషయం వారం రోజుల ముందే తమకు తెలిసిందన్నారు. ఈ హత్య కేసులో బీటెక్ రవిని, ఆదినారాయణరెడ్డిని విచారించాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

వివేకా భార్య, కూతుళ్లను జగన్ భయపెట్టాడు: చంద్రబాబు

గుండెపోటు అని చెప్పిందెవరు: వైఎస్ వివేకా హత్యపై కూతురు సునీతా రెడ్డి

తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు