అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన దేవినేని ఉమ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

కేసీఆర్ ఓ చవట, పనికిమాలిన దద్దమ్మ, లఫంగి అంటూ తిట్టిపోశారు. డబ్బు మదంతో అధికారం తలకెక్కి కేసీఆర్ సోయ లేకుండా మాట్లాడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు. బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గెలిచానన్న అహంకారంతో ఎగిరెగిరిపడుతున్నావ్ అంటూ విమర్శించారు. 

నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ నిలదీశారు. దొంగనోటు కేసులో జైలుకెళ్లబోతున్న నిన్ను కాపాడి మంత్రిని చేసిన విషయం మరచిపోయావా అంటూ నిలదీశారు. 

రిటర్న్ గిఫ్ట్ ఇస్తా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్న కేసీఆర్ దమ్ముంటే ఇవ్వాలన్నారు. అంతేకానీ అదిగో ఇస్తా అద్భుతంగా ఇస్తానంటూ బెదిరిస్తే బెదిరిపోయేవాళ్లు ఎవరూ లేరన్నారు. కేసీఆర్ నీకు కాదు కదా నీ బాబుకు కూడా భయపడేవారు ఎవరూ లేరని ఘాటుగా విమర్శించారు. 

రాజకీయంగా నీ అభివృద్ధికి సహకరించిన చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అంటూ విరుచుకుపడ్డారు. తిన్నంటి వాసాలు లెక్కపెడుతున్న కేసీఆర్ రాజకీయాల్లో మిడిసిపాటు తగదని హితవు పలికారు. రాజకీయాల్లో అసభ్య  పదజాలం సరికాదన్నారు. 

కేసీఆర్ గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే మంచిదని సూచించారు. ఒకప్పుడు నక్సలైట్లకు భయపడి బెజవాడ వచ్చి దాక్కుంది గుర్తులేదా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. తాను హైదరాబాద్ వెళ్లనని బెజవాడలోనే ఆటో తిప్పుకుని బతుకుతానన్నది మరచిపోతే ఎలా అంటూ నిలదీశారు. 

ఏదోకాలం కలిసి వచ్చింది రెండోసారి సీఎం అయ్యావ్ అధికారంతో మిడిసిపడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఏదో పీకుతానని బెదిరిస్తున్నావ్ ఏం పీకుతావ్ పీక్కో అంటూ సవాల్ విసిరారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్! దమ్ముంటే ఏపీలో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకో

చంద్రబాబు పెంచితేనే కేసీఆర్ నాయకుడు అయ్యారు

రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలుస్తాం, ఆయన తిట్లే మాకు ఆశీర్వచనాలు

సీఎం అయినంత మాత్రాన కేసీఆర్ అలా చెండాలంగా మాట్లాడతారా

చంద్రబాబు లీడర్ కాదు, మేనేజర్: కేసీఆర్

ఆ పుణ్యం కట్టుకుంది ఎన్టీఆర్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా: కేసీఆర్

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా కాస్కో,ఘోరంగా ఓడిపోతావ్: కేసీఆర్

హరికృష్ణ చావును కూడా రాజకీయం చేశాడు, అమాయకురాలిని బలిచేశాడు: కేసీఆర్

అప్పుడు మోడీ, ఇప్పుడు రాహుల్ గాంధీ సంకనాకుతున్న చంద్రబాబు

పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిన వారికి కర్రు కాల్చి వాత పెట్టిన తెలంగాణ ప్రజలు: కేసీఆర్