హైదరాబాద్: రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు కాస్కో అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోరాతి ఘోరంగా ఓటమి పాలవ్వడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

చంద్రబాబు నాయుడును ప్రజలు తిరస్కరిస్తారన్నారు. నా ముందే ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు సిగ్గు తెచ్చుకున్నాడని కేసీఆర్ బహిర్గతం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని  పొగడాలని భావించి సిగ్గు తెచ్చుకున్నాడన్నారు. 

మోదీని ఉద్దేశిస్తూ ఒక ముఖ్యమంత్రి ప్రధాని కావడం రాష్ట్రాలు బాగుపడతాయంటూ పొగిడారని తెలిపారు. ఆ సందర్భంలో ఇతర పార్టీలు హే పాగల్ క్యా అని తనను అడిగారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి పీవీ నరసింహరావు ప్రధాని మంత్రి కాలేదా అని అడిగారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఇలానే అడ్డదిడ్డం మాట్లాడతారంటూ తాన సర్ది చెప్పానన్నారు.