హైదరాబాద్: ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని తమని విమర్శిస్తున్నారని అసలు చంద్రబాబు నాయుడుకు సిగ్గు ఉందా అంటూ నిలదీశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మెుదటి నుంచి కోరుతుంది టీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాను తాము ఎందుకు అడ్డుకుంటామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మెుదటి నుంచి ఒకే మాట మీద ఉందని అది ఏపీకి ప్రత్యేక హోదా అని చెప్పుకొచ్చారు. 

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజకీయ అనుభవజ్ఞుడు కె. కేశవరావు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా చెయ్యని విధంగా పోరాటం చేశామని తెలిపారు. 

తాము ఏనాడు ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేదన్నారు. ఏపీ అభివృద్ధికి తాము పాటుపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనలో భాగంగా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలలో ఇరు రాష్ట్రాలకు ఇవ్వాలని అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిందే తాము అని చెప్పారు. 

ఇకపోతే పార్లమెంట్ లో నిజామాబాద్ ఎంపీ కవిత పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఆ విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి తమపై విష ప్రచారం చేస్తావా అంటూ నిలదీశారు. అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తానని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా విషయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబునాయుడేనని ఆరోపించారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా సంజీవని అన్నది చంద్రబాబు కాదా అంటూ నిలదీశారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది లేదా అన్నారు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కావాలని మళ్లీ వద్దని ఇలా ఒక్కోసారి ఒక్కో నిర్ణయం ప్రకటించడం వెనుక అసలు మతలబు ఏంటని ప్రశ్నించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా కాస్కో,ఘోరంగా ఓడిపోతావ్: కేసీఆర్

హరికృష్ణ చావును కూడా రాజకీయం చేశాడు, అమాయకురాలిని బలిచేశాడు: కేసీఆర్

అప్పుడు మోడీ, ఇప్పుడు రాహుల్ గాంధీ సంకనాకుతున్న చంద్రబాబు

పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిన వారికి కర్రు కాల్చి వాత పెట్టిన తెలంగాణ ప్రజలు: కేసీఆర్