అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ ఉపయోగించిన భాష దరిద్రమైన భాష అంటూ విరుచుకుపడ్డారు. రెండోసారి సీఎం అయినంత మాత్రాన ఇంత చెండాలంగా మాట్లాడతారా అంటూ విమర్శించారు.

కూలిపని చేసే వ్యక్తి కూడా మాట్లాడరని తెలిపారు. తాము ఒక వ్యక్తిని గౌరవించేలా మాట్లాడతామని సంస్కారం ఉందన్నారు. కేసీఆర్ లా మోదీ గాడు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడమన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటారని మళ్లీ అదే నోటితో తిడతారంటూ విమర్శించారు. 

ప్రత్యేక హోదాపై కేసీఆర్ మాట్లాడిన మాటలు అన్నీ అవాస్తవాలేనన్నారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఒక్క మాటైనా వాస్తవం ఉందా అన్నారు. కేసీఆర్ మాట్లాడే భాష సరైంది కాదన్నారు. కేంద్రప్రభుత్వం ఏపీకి నిధులు ఇచ్చిందని కేసీఆర్ చెప్తున్నారని ఎక్కడా కేంద్రం ఇవ్వలేదన్నారు. 

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధులు ఇవ్వలేదని ఇస్తామని ప్రకటించి ఆ తర్వాత కొసరు కొసరు ఇచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు మాటమీద నిలబడే వ్యక్తి అని చెప్పుకొచ్చారు.  కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని కనీసం ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అంటూ నిలదీశారు.