హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దివంగత సీఎం ,టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావేనని కొనియాడారు. తమ గ్రామ కమిటీలలో కానీ, అనుబంధ కమిటీలలో కానీ, బీసీలకు 51శాతం పదవులు కల్పించాలని తమ పార్టీ రాజ్యాంగంలో ఉందన్నారు. 

పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లపై ప్రయత్నిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసింది ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పించాలని మొత్తంగా పుణ్యం కట్టుకుంది ఎన్టీఆర్ అంటూ చెప్పారు. 

బీసీలు జడ్పీ చైర్మన్లు, మండల అధ్యక్షులు అయ్యారు. మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలన్నా పుష్కలంగా దొరుకుతున్నారు. బీసీ నాయకులు అందుబాటులోకి వచ్చారు. సముచిత స్థానం బీసీలకు ఇచ్చుకుంటాంమని కేసీఆర్ తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా: కేసీఆర్

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా కాస్కో,ఘోరంగా ఓడిపోతావ్: కేసీఆర్

హరికృష్ణ చావును కూడా రాజకీయం చేశాడు, అమాయకురాలిని బలిచేశాడు: కేసీఆర్

అప్పుడు మోడీ, ఇప్పుడు రాహుల్ గాంధీ సంకనాకుతున్న చంద్రబాబు

పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిన వారికి కర్రు కాల్చి వాత పెట్టిన తెలంగాణ ప్రజలు: కేసీఆర్