Asianet News TeluguAsianet News Telugu

పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిన వారికి కర్రు కాల్చి వాత పెట్టిన తెలంగాణ ప్రజలు: కేసీఆర్

తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంతో అద్భుతమైనదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి, బీజేపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పారు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి, పసలేని ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలాంటి సమాధానం చెప్పాలో ప్రజలు చెప్పారని స్పష్టం చేశారు. 

kcr comments on bjp
Author
Hyderabad, First Published Dec 29, 2018, 5:22 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంతో అద్భుతమైనదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి, బీజేపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పారు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి, పసలేని ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలాంటి సమాధానం చెప్పాలో ప్రజలు చెప్పారని స్పష్టం చేశారు. 

ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ సంబంధం లేకుండా ఇష్టం లేకుండా మాట్లాడిందని మండిపడ్డారు. ఐదుగురు ముఖ్యమంత్రులు, ప్రధాని మంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగినా బీజేపీ ఒక్కసీటుకే పరిమితమైందని మండిపడ్డారు. 

118 స్థానాల్లో పోటీ చేస్తే 103 స్థానాల్లో డిపాజిట్ దక్కలేదని అదీ బీజేపీకి తెలంగాణలో ఉన్న స్థానం అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు గట్టి సమాధానం చెప్పారన్నారు. అయినా బీజేపీ తీరులో మార్పు రాలేదని విమర్శించారు. 

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, టీ టీడీపీ బీసీలపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోందంటూ విరుచుకుపడ్డారు. షోకాల్డ్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు బీసీలను అణగదొక్కాయని ఆరోపించారు. బీసీల హాస్టల్స్ పెంచామని, బీసీలకు పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేనేత కార్మికులను ఆదుకున్నామని, నాయి బ్రహ్మణులను ఆదుకున్నామన్నారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపామన్నారు. అలాగే మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. 

సీఎం తర్వాత రెండు ప్రోటోకాల్స్ ఉంటాయని అవి స్పీకర్, శాసనమండలి చైర్మన్ పదవులు అని అవి రెండు బీసీలకే కట్టబెట్టామన్నారు. అలాగే విప్ లుగా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బీసీలను సర్వనాశనం చేశాయని వారి ఆత్మహత్యలకు కారణమయ్యాయని ఆరోపించారు. బీసీలకు అత్యధిక రిజర్వేషన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం పట్టుబట్టిందన్నారు. కానీ బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ఉండేందుకు కోర్టకు వెళ్లింది కాంగ్రెస్ నేతలేనని స్పష్టం చేశారు. 

ఇప్పటికైనా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు పద్దతి మార్చుకోవాలని లేని పక్షంలో గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే మీ గాలి తీశారని ఇంకా తీసుకోవద్దని హితవు పలికారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios