హైదరాబాద్: రూ.2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన జయరామ్‌ తన ఆస్తుల్లో కొన్నిటిని శిఖా చౌదరి పేరిటే ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, వాటి డాక్యుమెంట్లను మాత్రం తన వద్దనే పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని అంటారు. 

వ్యాపార విషయాల్లో శిఖా చౌదరి జోక్యం పెరగడంతో జయరామ్‌ భార్య పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారని వాచ్‌మన్‌ వెంకటేశ్‌ తెలిపాడు. హత్య జరిగిన మరుసటి రోజు అంటే, 31వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో శిఖా చౌదరి హైదరాబాదులో గల జూబ్లీహిల్స్‌లోని జయరాం ఇంటికి వచ్చి జయరామ్‌ గది, బీరువా తాళాలు ఇవ్వాలని వాచ్‌మన్‌ వెంకటేశ్‌తో గొడవకు దిగాడు. తాను ఇవ్వనని అతను చెప్పడంతో వివాదానికి దిగారు.

బలవంతంగా ఆల్మారా తెరవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శిఖా చౌదరికి ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె వెంటనే హడావిడిగా వెనుదిరిగినట్లు చెబుతున్నారు. జయరాం మృతదేహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, హత్య మాత్రం హైదరాబాదులోనే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

హత్య 24 గంటల ముందు జరిగిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దాంతో జయరాంను హైదరాబాదులోనే జరిగిందని భావిస్తున్నారు. ఆయన హత్యకు పక్కా ప్రణాళిక రచించి అమలు చేసినట్లు కూడా భావిస్తున్నారు. జనవరి 30న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన జయరాం మృతదేహం 31వ తేదీ రాత్రి 11 గంటలకు నందిగామ సమీపంలోని ఐతవరంలో కనిపించింది.
 
ఈ మధ్య కాలంలో ఆయన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ జూబ్లీహిల్స్‌ దస్‌పల్లా హోటల్‌తోపాటు గచ్చిబౌలిలోని శిఖా చౌదరి ఇంటి వద్ద ఉన్నట్లు చూపించాయి. దాదాపు 10 గంటలపాటు హోటల్‌ వద్దనే జయరామ్‌ కదలికలు ఉన్నాయని నిర్ధారణ అయింది. దాంతో అక్కడికి వెళ్లి పోలీసులు విచారణ జరిపారు. హోటల్‌లో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అక్కడ జయరాం ఓ చానల్‌ యాంకర్‌తో ఉన్న ట్లు తేలింది. జనవరి 28న ఆమె పేరిటే రూమ్‌ బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది.
 
హోటల్‌లోకి జయరామ్‌ కారు వెళ్లిన దృశ్యాలు ఫుటేజీలో కనిపిస్తున్నాయి. కానీ, బయటకు వెళ్లిన దృశ్యాలు మాత్రం లేవు. పోలీసులకు ఇదొక చిక్కుముడిగా మారింది. అదే సమయంలో, జనవరి 30వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో జయరాం గచ్చిబౌలిలో ఉన్న శిఖా చౌదరి ఇంటికి వెళ్లారు. ఆయన కారు వచ్చినట్లు అక్కడి రిజిస్టర్‌లో నమోదై ఉంది. తర్వాత కాసేపటికే ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. 

తిరిగి తెల్లవారుజామున 3, 4 గంటలకు వచ్చింది. ఈ సమయంలో జయరాం ఎక్కడ ఉన్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, హోటల్‌లో ఉన్న మహిళ యాంకర్‌ కాదని, ఎక్స్‌ప్రెస్‌ టీవీలో గతంల యాంకర్‌గా పనిచేసిందని ఇప్పుడు మాత్రం జయరామ్‌కు పీఏగా పనిచేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఆమె మాట్లాడుతుండగానే ఆయన మరో వ్యక్తికి ఫోన్‌ చేసి రూ.6 లక్షలు తెప్పించుకున్నారని తెలిసింది.

జయరామ్‌కు బయట మద్యం సేవించే అలవాటు లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. కానీ, ఆయన తలపై బీరు బాటిల్‌తో కొట్టినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దాంతో, జయరామ్‌ తలపై హైదరాబాద్‌లోనే దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శిఖా ఇంట్లో గానీ, హైదరాబాద్‌లో మరో చోట గానీ బీరులో విషం కలిపి జయరామ్‌తో తాగించి, చంపేశారని అనుమానిస్తున్నారు. 

అందుకే ఆయన నోరు, ముక్కు నుంచి రక్తస్రావం జరిగిందని చెబుతున్నారు. ఆ తర్వాత బీరు సీసాతో తలపై కొట్టి, ఊపిరాడకుండా చేసి చంపేశారని అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు