ప్రకాశం బ్యారేజీలోకి వరద నీటి ఉధృతి బాగా పెరుగుతోంది. గంట గంటకీ నీటి శాతం పెరుగుతుండటంతో... నీరు పొంగి పొర్లుతోంది. కాగా... కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం సమీపంలోకి ఇప్పటికే వరద నీరు చేరుకుంది. కాగా... ఆయన  నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలి ప్యాడ్  కూడా పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది.

ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబి తోట, అరటి తోటలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇంటిలోనికి వరద నీరు చేరుకుండా సిబ్బంది సహాయంతో 10ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను వేస్తున్నారు. అయినా వరద ఉధృతిని అవి ఆలపలేకపోతున్నాయి, రివర్ ఫ్రంట్ వ్యూభవనం, వాక్ వే కూడా నీట మునిగిపోయాయి. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముడుతోంది.

శనివారం సాయంత్రానికి వదర మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగానే  నివాసంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా... వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు శుక్రవారం ఇరిగేషన్ అధికారులు చంద్రబాబు నివాసంలో డ్రోన్ కెమేరాతో పరిశీలించారు.

అయితే... జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రతిపక్ష ఇంటి వద్ద డ్రోన్లు ఎలా వినియోగిస్తారంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం నడుస్తోంది. వరద నుంచి రక్షించుకునేందుకే  చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారంటూ వైసీపీ నేతలు కామెంట్స్ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు..
వదలను బొమ్మాళి: చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

ఉండవల్లి 'అద్దె' ఇంటిపై చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు?

చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్: మంత్రులకు చుక్కెదురు

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే