తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారంటూ ప్రియురాలి ఇద్దరు పిల్లలను ప్రియుడు అత్యంత దారుణంగా చంపి పాతిపెట్టాడో ప్రియుడు. పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన ఓబులేసు బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

అక్కడే పనిచేస్తోన్న గణేశ్ అనే వ్యక్తితో ఆరు నెలల క్రితం పరిచయమైంది.. గణేశ్ భార్య నాగమ్మ కూడా అక్కడే హెల్పర్‌గా పనిచేస్తోంది. ఈ దంపతులకు దర్శిని అనే మూడేళ్ల కుమార్తె, మరో ఆరు నెలల కూతురు ఉన్నారు.. ఈ క్రమంలో నాగమ్మతో ఓబులేసుకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఓ రోజు తాను వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను స్వగ్రామమైన వెంకటగారిపల్లికి తీసుకొచ్చాడు. తన భార్య రాములమ్మకు పరిచయం చేసి నాగమ్మను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. దీనికి భార్య అభ్యంతరం వ్యక్తం చేయడం... ఇంట్లో ఉంచేందుకు అంగీకరించకపోవడంతో ఐదు రోజుల క్రితం పుట్టపర్తిలోని ఓ లాడ్జిలో నాగమ్మ, ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు.

అక్టోబర్ 26న రాత్రి నాగమ్మ నిద్రపోతున్న సమయంలో ఆమె ఇద్దరు పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి చంపి హంద్రీనీవా కాలువ వద్ద పూడ్చేశాడు. ఉదయం నిద్రలేచిన తర్వాత తన పిల్లలు ఎక్కడని నాగమ్మ ప్రశ్నించడంతో... ఇక్కడ మనకు అడ్డుగా వున్నారని బంధువుల ఇంట్లో వదిలి వచ్చినట్లు చెప్పాడు.  ఆ తర్వాత ఇద్దరు కలిసి బెంగళూరుకు వెళ్లిపోయారు.

అయితే పిల్లలు లేకుండా ఒక్కటే రావడంతో భర్త గణేశ్‌తో పాటు బంధువులు నిలదీశారు.. ఓబులేసు ఏం చేశాడో తనకు తెలియదని చెప్పడంతో అందరూ కలిసి అతన్ని  ప్రశ్నించడంతో పిల్లలను చంపేశానని అంగీకరించి పుట్టపర్తికి తీసుకొచ్చారు.

ఇక్కడికి వచ్చిన తర్వాత ఓబులేసు పిల్లలు లేరు.. ఏం చేసుకుంటారో చేసుకోండని.. ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా చంపేస్తానని బెదిరించాడు. దీనిపై గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు తమదైన స్టైల్లో విచారించగా పిల్లలిద్దరినీ తానే చంపినట్లు అంగీకరించి చిన్నారులను పాతిపెట్టిన స్థలానికి తీసుకెళ్లాడు. అయితే గురువారం రాత్రి బాగా పొద్దుపోవడంతో.. తహసీల్దార్ సమక్షంలో ఇవాళ మృతదేహాలను వెలికితీయించి పోస్ట్‌మార్టం చేయిస్తామని సీఐ తెలిపారు.
 

More News:

టెక్కీ ప్రశాంత్ సూసైడ్‌లో ట్విస్ట్: ప్రణయ్‌తో వివాహేతర సంబంధం, మరో ఆడియో టేపు

ప్రేమపెళ్లి, మరో మహిళతో వివాహేతర సంబంధం: తట్టుకోలేక భార్య ఆత్మహత్య

వివాహేతర సంబంధం: తప్పు తెలుసుకుని తప్పుకున్నా.. తరుముకొచ్చాడు

వదినతో వివాహేతర సంబంధం...చివరకి

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

వివాహేతర సంబంధం.. పచ్చడిబండతో భర్త తలపగలగొట్టిన భార్య

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

విశాఖలో మూడేళ్ల చిన్నారి అలేఖ్య హత్య, వివాహేతర సంబంధమే కారణమా?

వివాహేతర సంబంధంపై తీర్పు...భార్యభర్తల మధ్య చిచ్చు