వివాహేతర సంబంధానికి పర్యవసానం చావేనని మరోసారి రుజువైంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగంకు చెందిన షేక్ మౌలాలీకి షాహిదా అనే మహిళతో కొంతకాలం క్రితం పెళ్లయ్యింది..వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరో మహిళతో సంబంధం పెట్టుకుని భర్త తనను హింసిస్తుండటంతో మూడు నెలల క్రితం అతని భార్య షాహిదా ఆత్మహత్యకు పాల్పడింది.

భార్య మరణించినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. అేద గ్రామానికి చెందిన మరో మహిళ టపా మల్లేశ్వరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మౌలాలీ తరచుగా ఆమెను కలుస్తూ ఉండేవాడు. ఈ విషయం పెద్దల వరకు వెళ్లడంతో మల్లేశ్వరి తన ప్రవర్తన మార్చుకుని మౌలాలికి అతడికి దూరంగా ఉంటోంది.. దీంతో ఆగ్రహించిన మౌలాలి ఆమెను హత్య చేయడానికి కుట్ర పన్నాడు.

మల్లేశ్వర దంపతులు కొత్తగా నిర్మించుకుంటున్న నూతన గృహం పనుల వద్దకు రావడంతో సిమెంట్ పనిచేస్తున్న సిబ్బందికి బుధవారం మధ్యాహ్నం భోజనం పెట్టింది. ఆ తర్వాత రెండు గంటల ప్రాంతంలో మల్లేశ్వరిని తన ఆటోలో ఎక్కించుకున్న మౌలాలి రెడ్డిగూడెం సమీపంలో గోరంట్ల మేజర్ కాలువ వైపుగా వెళ్లి మల్లేశ్వరితో గొడవ పడ్డాడు.. అనంతరం ఆమెను అక్కడే కత్తితో పొడిచాడు...

మళ్లీ అదే ఆటోలో మల్లేశ్వరిని ఎక్కించుకుని ఉత్తరం దిక్కుగా వెళ్లి మరోసారి మల్లీశ్వరిని గాయపరిచాడు. ఆమె కిందపడిన తర్వాత తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు, మద్యం, కూల్‌డ్రింక్ కలిపి తాగాడు. మల్లేశ్వరి అరుపులు విన్న ఓ యువకుడు.. అక్కడి రైతుల వద్దకు విషయం చెప్పాడు..

వారు వచ్చేసరికి మల్లేశ్వరి కొనఊపిరి కొట్టుమిట్టాడుతూ ఉండగా.. మౌలాలి నోటి వెంట నురగలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో మౌలాలి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.